సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెస్మరైజ్ చేసిన మూవీ దేవి పుత్రుడు. కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వెంకటేష్,సౌందర్య హీరోహీరోయిన్లుగా, అంజలా జవేరి సురేష్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ మూవీని ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేరు. ఆ టైమ్లోనే ఎంతో గ్రాఫిక్స్ ను వాడుకొని ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయినా ఇందులో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసినటువంటి పాపకు మాత్రం మంచి పేరు వచ్చింది.
అలాంటి ఈ పాప ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. దేవి పుత్రుడు సినిమా కథ విషయానికి వస్తే నీట మునిగిన ద్వారకా నగరాన్ని కనుగొనడం కోసం పవర్ బాక్స్ వంటి అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇందులో వెంకటేష్ ద్విపాత్రాభినయం చేశారు. ఇందులో ఒకరు ప్రభుత్వ ఉద్యోగి మరొకరు దొంగ గా నటించారు. ప్రభుత్వ అధికారి పాత్రలో నటించిన వెంకటేష్ భార్య సౌందర్య.ఆమె గర్భవతిగా ఉన్న సమయంలో చంపేస్తారు. దీంతో కడుపులో ఉన్న శిశువు కూడా చనిపోతుంది. అయితే ఈ శిశువు పెద్దయ్యాక ఎలా ఉంటుందో ముందుగానే ఊహించి వెంకటేశ్ ఓ బొమ్మ గీస్తాడు. ఇక ఆ పాప మరణించాక అదే రూపంలో ఆత్మ గా వెంకటేష్ కు కనిపిస్తుంది.
ఆ పాప మాత్రం నటించిన బాలనటి పేరే వేగా తమోతియా .. ఇక పేరు ఎవరికీ తెలియదు కానీ దేవి పుత్రుడు సినిమా లో బాలనటి అంటే అందరు గుర్తుపడతారు. కానీ అప్పటికి ఇప్పుటికి చాలా అందం గా మారిపోయింది ఈ నటి.ఆమె ఇప్పుడు మీరు చూస్తే అస్సలు గుర్తుపట్టలేరు. సోషల్ మీడియా పుణ్యమా అని ఆమె ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అందరూ ఆమెను చూసి ఆశ్చర్యపోతున్నారు.