Honey Rose : నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం వీరసింహారెడ్డి. ఈ చిత్రం 2023 జనవరి 12న విడుదల కానుండగా, ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అప్పట్లో ఒంగోల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలయ్యతో పాటు మిగతా చిత్ర యూనిట్ అంతా హాజరయ్యారు. అయితే హనీరోజ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈమె డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ‘మాన్ స్టర్’ అనే మూవీ రిలీజ్ కాగా, అందులో నటించి మెప్పించింది. మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ మూవీలో మంచు లక్ష్మీ ఓ లెస్బియన్ గా ఛాలెంజింగ్ రోల్ చేయగా, హనీ రోజ్ తోనే ఈమె ప్రేమలో ఉండటం అలాగే ఆమెతో రొమాన్స్ చేయడం చేసింది. చిత్రంలో హనీ రోజ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.
గతంలో ఈమె తెలుగులో ‘ఆలయం’ ‘ఈ వర్షం సాక్షిగా’ వంటి సినిమాల్లో కూడా నటించింది. కానీ అంత పాపులర్ కాలేదు. ఇప్పుడు బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ మూవీలో పెద్ద బాలయ్యకు భార్యగా నటించింది. ఈమె వయసు 33 ఏళ్ళు. సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటాయి. కేరళలో పుట్టిన హనీ.. 14 ఏళ్ల ఏజ్ లోనే యాక్టర్ అయిపోయింది. అంటే 2005లో నటిగా మలయాళంలో తొలి సినిమా చేసింది. అయితే అడపాదడపా చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చింది.
అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న హానీరోజ్ తన గ్లామర్‌తో ఎప్పటికప్పుడు అందరి మనసులు కొల్లగొడుతూ ఉంటుంది. ఈ అమ్మడు తెలుగమ్మాయి మాదిరిగానే అచ్చమైన తెలుగులో మాట్లాడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.