Pooja Hegde : సెలబ్రిటీలు అన్నాక అందరి మధ్యా పోటీ ఉంటుంది. ఈ క్రమంలోనే కొందరు సెలబ్రిటీలకు మధ్య కోల్డ్ వార్ జరుగుతుంటుంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వారి మధ్య గొడవలు ఉంటాయి. అయితే సోషల్ మీడియా వచ్చాక ఆ మాధ్యమంలో కొందరు సెలబ్రిటీలు గొడవ పడుతున్నారు. పూజా హెగ్డె, సమంత కూడా ఇదే కోవకు చెందుతారని చెప్పవచ్చు. గతంలో వారి మధ్య కోల్డ్ వార్ నడిచింది.
2020లో పూజా హెగ్డె.. సమంతకు చెందిన ఓ ఫొటోను షేర్ చేసి.. కింద.. ఏమంత అందంగా ఏమీ లేదు.. అని కాప్షన్ పెట్టింది. దీంతో అప్పట్లో ఈ విషయం వైరల్ అయింది. సమంత ఫ్యాన్స్ చాలా మంది పూజా హెగ్డెను ట్రోల్ చేశారు. అయితే ఆమె తరువాత తన సోషల్ ఖాతా హ్యాక్ అయిందని.. ఆ పోస్టు తాను పెట్టలేదని చెప్పింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పూజా హెగ్డెను చాలా మంది విమర్శించారు. అయితే అప్పటికి ఆ వివాదం సద్దుమణిగింది.
ఇక రీసెంట్గా సమంత ఓ వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఆమె ఓ పాటకు డ్యాన్స్ చేసింది. అది పూజా హెగ్డెకు చెందిన రాబోతున్న సినిమా. తమిళ స్టార్ విజయ్‌తో కలిసి ఆమె నటించిన బీస్ట్ సినిమాలోని అరబిక్ కుతు అనే పాటకు సమంత స్టెప్పులేసింది. దీంతో పూజా హెగ్డె ఆ పాటను షేర్ చేసింది. ఈ క్రమంలోనే ఈ పోస్టుతో సమంత, పూజా హెగ్డెల మధ్య ఉన్న వార్ ముగిసిందని.. ఇద్దరూ కలిసిపోయారని అంటున్నారు. అయితే ఈ ఇద్దరి మధ్య ఉన్న గొడవ నిజంగానే ముగిసిందా.. లేదా.. అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.