Woman Telling Secret : ఆచార్య చాణక్య ఎన్నో విషయాలని చెప్పారు. చాణక్య చెప్పినట్లు చేయడం వలన, జీవితం చాలా బాగుంటుంది. మహిళలు ఈ విషయాలని ఎప్పటికీ ఎవరితో కూడా పంచుకోకూడదు. మరి, మహిళలు ఇతరులతో పంచుకోకూడని, విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మహిళలు ఎప్పుడూ కూడా ఈ విషయాలని రహస్యంగా ఉంచాలి. ఈ విషయాలను బయటకి అసలు చెప్పకూడదని చాణక్య అన్నారు. మహిళలు ఎప్పుడు కూడా, ఆర్థిక విషయాల గురించి ఎవరికీ చెప్పకూడదు. సన్నిహితులకి, కుటుంబ సభ్యులకి, స్నేహితులకు కూడా చెప్పకూడదు. ఆదాయం, ఖర్చులు, పొదుపు, పెట్టుబడుల గురించి ఎవరికీ చెప్పకుండా రహస్యంగానే ఉంచాలని చాణక్య చెప్పడం జరిగింది.
అలానే, కుటుంబ సమస్యల గురించి కూడా మహిళలు ఇతరులతో చెప్పుకోకూడదు. బయట వ్యక్తులకి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో విషయాలు చెప్పకూడదు. కుటుంబ విషయాలను ఇతరులకి చెప్పడం వలన గౌరవం, విశ్వాసం ని కోల్పోతారు. అన్నిటికంటే ముఖ్యంగా కుటుంబ ప్రతిష్ట దెబ్బతింటుంది. కాబట్టి మహిళలు ఎప్పుడూ కూడా ఈ విషయాలని ఎవరితోనూ పంచుకోకూడదు.
అలానే, ఆరోగ్య విషయాలు కూడా చెప్పకూడదు. అనారోగ్య సమస్యలు ఏమైనా వస్తే వాటిని ఇతరులతో పంచుకోకుండా గోప్యంగా ఉంచాలి. అనవసరంగా అందరితో చెప్పుకోకూడదు. కేవలం వైద్యులతో మాత్రమే, వారి యొక్క ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడాలి. అంతే కానీ అందరితో ఈ విషయాలని ఓపెన్ గా చెప్పుకోకూడదు.
వ్యక్తిగత విషయాల గురించి కూడా ఎవరికీ చెప్పకూడదు. సంబంధాలు, భావోద్వేగ సమస్యలు, వ్యక్తిగత ఆలోచనలు ఇటువంటివన్నీ కూడా చెప్పకూడదు. అలానే, స్త్రీలు ఎప్పుడు కూడా ఇతరుల రహస్యాలని గోప్యంగా ఉంచాలి అని చాణక్య అన్నారు. వేరొకరి రహస్యాలని బహిర్గతం చేయడం వలన వారి ప్రతిష్ట దెబ్బతింటుంది. అలానే, మీరు మీ మీద వారు ఉంచిన నమ్మకని దెబ్బతీస్తున్నారు కాబట్టి, ఈ విషయాన్ని ఎవరితో కూడా పంచుకోవద్దు.