Actress : ఇటీవల హీరోయిన్లు సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేయడమే కాకుండా.. సినిమా అప్‌డేట్స్, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ రేర్ పిక్స్‌ను పోస్ట్ చేస్తున్నారు. అలాగే అప్పుడప్పుడూ ఇన్‌స్టా లైవ్‌లోకి వస్తూ ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇక ఇప్పుడు త్రోబ్యాక్ ఫోటోల ట్రెండ్ నడుస్తుంది. సందర్భం వచ్చినప్పుడల్లా హీరోయిన్లు తమ చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇటీవల పూజ హెగ్డే, రష్మిక, తమన్నా ఫోటోలు ట్రెండ్ అయిన విషయం తెలిసిందే.
తాజాగా ఓ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. పైన పేర్కొన్న ఫోటోలోని చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? చిరునవ్వులు చిందిస్తూ.. ఫోటోకు పోజిస్తున్న ఈ బూరెబుగ్గల బుజ్జాయి ఓ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంది. ఏకంగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మహానటిగా పేరు సంపాదించుకుంది. ఇప్పుడు గుర్తొచ్చింది కదా ఆ చిన్నారి ఎవరో.. ఆ పాపే కీర్తి సురేష్. రామ్ పొతినేని హీరోగా నటించిన నేను శైలజతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన కీర్తి, ఫస్ట్ మూవీతోనే అందం అభినయంతో ఆకట్టుకుంది.
ఆ మూవీ హిట్ అవ్వడంతో కీర్తికి వరుసగా అవకాశాలు వచ్చాయి. కీర్తి మహానటి సావిత్రి బయోపిక్ చిత్రంలో నటించి జాతీయస్థాయిలో ఉత్తమ నటిగా అవార్డు కూడా అందుకుంది. అలాగే కీర్తి సురేష్ ఎన్నో లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో పాటు కమర్షియల్ చిత్రాల్లో నటించి మెప్పించింది. కీర్తి సురేష్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించి సర్కారు వారి పాటతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకుంది.