బాలీవుడ్ కు గట్టి పోటీగా టాలీవుడ్ ఇండస్ట్రీ నిలుస్తోంది. అయితే పాన్ ఇండియా సినిమాలు ప్రారంభమైన దగ్గర నుండి మంచి సినిమాలు తో పాటుగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు కూడా భారీగా వస్తున్నాయి. టాలీవుడ్ తో పాటుగా దక్షిణ భారతదేశం నుండి ఎన్నో మంచి సినిమాలను విడుదల చేస్తున్నారు. బాహుబలి నుండి కాంతారా వరకు మంచి కలెక్షన్లు దేశవ్యాప్తంగా ఇచ్చాయి. అయితే షారుక్ ఖాన్, ప్రభాస్, రజనీకాంత్, కమల్ హాసన్, అమితాబచ్చన్, అమీర్ ఖాన్ వంటి వారు కూడా ఇంత కలెక్షన్లు చేసి ఉండరు.
అల్లు అర్జున్, ఫాహద్ ఫాజిల్, రష్మిక మందన్న నటిస్తున్న పుష్ప ద రూల్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. పైగా మొదటి పార్ట్ తో ఈ సినిమా ఎంతో హైప్ ను క్రియేట్ చేసింది అని చెప్పవచ్చు. ఈ సినిమా ఓటీటీ రైట్స్ అమ్మడం ద్వారా 900 కోట్లను సంపాదించారు అని టాక్ నడుస్తోంది.
ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ 270 కోట్లకు కొనుగోలు చేసింది అని మీడియా రిపోర్ట్స్ చెబుతున్నాయి. అయితే రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ సినిమా కేవలం 170 కోట్లు కు మాత్రమే ఓటీటీ రైట్స్ ఇచ్చారు. పైగా పుష్ప ద రూల్ సినిమా బడ్జెట్ 500 కోట్ల వరకు ఉండొచ్చని అంటున్నారు.