Pooja Hegde : ఈమధ్యకాలంలో మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోయిన్లు ఎవరు ? అని ప్రశ్న వేస్తే.. అందుకు పూజా హెగ్డె అని సమాధానం వస్తుంది. రష్మిక మందన్న మాత్రమే కాకుండా పూజా హెగ్డె ఈ మధ్యకాలంలో నటించిన అనేక చిత్రాలు హిట్ అయ్యాయి. దీంతో ఈ భామ తన రెమ్యునరేషన్‌ను అమాంతం పెంచింది. ఈ క్రమంలోనే ఈమెతో సినిమా చేయాలంటే దర్శక నిర్మాతలు భయపడుతున్నారు. అయితే సోషల్ మీడియాలోనూ పూజా హెగ్డె ఇటీవలి కాలంలో తరచూ యాక్టివ్‌గా ఉంటోంది.
ఈ మధ్య మాల్దీవ్స్‌కు రెండు సార్లు పూజా హెగ్డె వెళ్లింది. అక్కడ ఈమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అందాల ఆరబోతతో కూడిన ఫొటోలను షేర్ చేసి అలరించింది. ఆ తరువాత మళ్లీ ఇంకోసారి ఫ్యామిలీతో కలిసి అక్కడికే వెకేషన్‌కు వెళ్లింది. అనంతరం ఇండియాకు వచ్చి తిరిగి షూటింగ్ పనుల్లో బిజీగా మారింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్‌ను ఒలకబోస్తూ సందడి చేస్తోంది. అందులో భాగంగానే ఈమె తాజాగా జిమ్‌కు వెళ్తూ ఫొటోలకు పోజులు ఇచ్చింది. ఆ సమయంలో తీసిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
పింక్ కలర్ ఉన్న టైట్ జిమ్ డ్రెస్ వేసుకున్న పూజా హెగ్డె కెమెరాలకు పోజులు ఇచ్చింది. దీంతో ఆమె ఫొటోలు ప్రేక్షకుల మతులను పోగొడుతున్నాయి. ఇక పూజా హెగ్డె ప్రభాస్‌తో కలిసి నటించిన రాధేశ్యామ్ మూవీ త్వరలో విడుదల కానుండగా.. మహేష్ బాబుతో కలిసి ఈమె మరోమారు ఓ సినిమాలో నటించనుంది. ఈ మూవీ షూటింగ్ కూడా అతి త్వరలో ప్రారంభం కానుంది.