Ravi Teja Khiladi Movie : ప్రస్తుత తరుణంలో థియేటర్లలో విడుదల అవుతున్న సినిమాలు చాలా త్వరగా ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. దీంతో చాలా మంది ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం కన్నా ఓటీటీనే బెటర్.. అని భావిస్తున్నారు. అందులో భాగంగానే ఓటీటీ యాప్లు కూడా వీలైనంత త్వరగా సినిమాలను స్ట్రీమ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక మాస్ మహరాజ రవితేజ నటించిన ఖిలాడి సినిమా కూడా చాలా త్వరగా ఓటీటీలోకి వచ్చిందని చెప్పవచ్చు. ఈ సినిమా ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్లో స్ట్రీమ్ అవుతోంది.
రవితేజ హీరోగా, డింపుల్ హయతి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా రిలీజ్ అయిన చిత్రం.. ఖిలాడి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ సినిమాను ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్లో స్ట్రీమ్ చేస్తున్నారు. అందువల్ల ఈ మూవీని ఈ యాప్లో ప్రస్తుతం వీక్షించవచ్చు. అయితే ఈ సినిమా హిట్ టాక్ సాధించనందున ఓటీటీలోనూ మెరుగైన ప్రదర్శన చేస్తుందా.. అన్న అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే గతంలో అఖండ.. వంటి చిత్రాలు థియేటర్లలో హిట్ అయ్యాయి. అవి ఓటీటీలో విడుదలైనా మంచి వ్యూస్నే రాబట్టాయి. కానీ ఫెయిల్ అయిన చిత్రాలకు అటు ఓటీటీలోనూ ఆదరణ లభించడం లేదు. మరి ఖిలాడి విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.
ఇక ఈ మూవీ ఫ్లాప్ కావడంతో రవితేజ తన తరువాతి సినిమా రామారావు ఆన్ డ్యూటీకి తక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. అలాగే ఆ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. దీనిపై త్వరలోనే చిత్ర యూనిట్ అధికారికంగా వివరాలను వెల్లడించనుంది.