Valimai : ఓటీటీల పుణ్యమా అని ప్రేక్షకులు నెల రోజులు తిరగకుండానే కొత్త కొత్త సినిమాలను ఆ యాప్‌లలో వీక్షిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. కొన్ని సినిమాలు అయితే కేవలం రెండు వారాల్లోనే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. దీంతో ప్రేక్షకులు పండుగ చేసుకుంటున్నారు. ఇక ఈ మధ్య కాలంలో ఓటీటీల జోరు పెరిగిందనే చెప్పవచ్చు. అగ్ర హీరోలు మొదలుకొని చిన్న హీరోల వరకు అనేక మంది సినిమాలు ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. ఇక తాజాగా అగ్ర హీరో అజిత్ సినిమా వలిమై కూడా ఓటీటీలో స్ట్రీమ్ కానుంది.
తమిళ స్టార్ నటుడు అజిత్ కుమార్ నటించిన తాజా చిత్రం వలిమై.. ఈ మధ్యే థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాను ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నిర్మించారు. హెచ్.వినోద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కార్తికేయ విలన్‌గా నటించాడు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 24వ తేదీన ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్‌లో విడుదల చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మళయాళం భాషల్లో ఈ సినిమా రిలీజ్ అయింది. బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.
కాగా ఈ సినిమా విడుదలైన 3 రోజుల్లోనే రూ.100 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. అయితే ఈ సినిమాకు గాను జీ5 సంస్థ డిజిటల్ హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో మార్చి 25వ తేదీ తరువాత ఈ సినిమా ఆ యాప్‌లో స్ట్రీమ్ అవుతుందని సమాచారం. ఈ క్రమంలోనే త్వరలో దీనిపై అధికారిక వివరాలను ప్రకటించనున్నారు.