మురారి చిత్రం తర్వాత మహేష్ బాబు నటించిన టక్కరి దొంగ, బాబి సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి. కచ్చితంగా హిట్టు కొట్టాల్సిన టైం లో 2003 వ సంవత్సరంలో ఒక్కడు మూవీ వచ్చింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం ఎవరు ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ కొట్టింది. దర్శకుడు గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఒక్కడు సినిమాతో మహేష్ బాబు లోని ఇంటెన్సిటీ బయటపడిందనే చెప్పాలి.
అయితే, ఒక్కడు సినిమాలో మహేష్ బాబు ఇంటెన్స్ తో స్టైలిష్ గా సిగరెట్స్ కాల్చడం మనం చూసాం. ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు, సాహసం సాంగ్ లో, ప్రకాష్ రాజుతో జీప్ లో వెళ్తున్నప్పుడు, ఇంకా హరే రామ సాంగ్ టైంలో, ఇలా ప్రతి సన్నివేశంలో మహేష్ బాబు స్మోకింగ్ షాట్స్ ని ఎంతో అందంగా క్యాప్చర్ చేశాడు గుణశేఖర్. అదే ఈ సినిమా తమిళ రీమేక్ గిల్లి విషయానికి వచ్చేసరికి, అంతా కొత్తగా సిగరెట్ కాల్చడం నేర్చుకునే వారు కాల్చినట్లుగా కామెడీ చేసేసారని అన్నారు. ఒక్కడు సినిమా అంతా హీరో మహేష్ బాబు ఎంతో ఇంటెన్స్ తో, అటు సీన్స్ లో సీరియస్ నెస్, హీరోయిక్ మేనరిజం ఎంతో అందంగా చూపించారు.
కానీ, గిల్లీలో విజయ్ క్యారెక్టర్ లో ఇంటెన్స్, సీరియస్ నెస్ ఎక్కడ కనిపించవు. ప్రస్తుతం ఒక్కడులో మహేష్ బాబు క్యారెక్టరైజెషన్, రీమేక్ గిల్లీలో విజయ్ క్యారెక్టరైజేషన్స్ కి సంబంధించి వీడియోలు పోస్ట్ చేస్తూ పోల్ చేస్తున్నారు నెటిజన్స్. బ్లాక్ బస్టర్ ఒక్కడు సినిమాని విజయ్ కామెడీ యాక్టింగ్ తో చెడగొట్టేసారని, దాన్ని తమిళ ఆడియన్స్ ఎలా అంగీకరించారో అర్థం కావట్లేదని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. అలాగే సినిమాలో మహేష్ బాబు సిగరెట్ తాగే సీన్స్ తో, విజయ్ సీన్స్ పోల్చి సోషల్ మీడియాలో కడిగేస్తుండటం గమనార్హం. మరి ఇన్నేళ్ల తర్వాత ఎందుకు ఒక్కడు టాపిక్ తెరపైకి వచ్చిందని అంటే, ఇటీవల మహేష్ బాబు ఫ్యాన్స్, ఒక్కడు, పోకిరి సినిమాలు సెలెబ్రేషన్స్ జరిపిన విషయం విధితమే. ఈ క్రమంలోనే గిల్లీలో విజయ్ సీన్స్ పై ట్రోల్స్ మొదలైనట్లు సమాచారం.