బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. షారుక్ ఖాన్ కి భాషతో సంబంధం లేకుండా అభిమానులు ఉన్నారు. ఎలాంటి సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన షారుక్ ఖాన్.. తన సినిమాలతో బాలీవుడ్ లో బాద్షా అనిపించుకున్నాడు. అయితే షారుక్ ఖాన్ నటించిన పఠాన్, జవాన్ సినిమాలు రెండు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఈ క్రమంలోనే వరుస హిట్స్‌తో షారూక్ మళ్లీ గాడిలో పడ్డారు. ఇక ఇదే కాక షారుక్ ఖాన్ ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు యజమానిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే షారుక్ ఖాన్ 1988 లో మొదట దూరదర్శన్ లో ప్రసారమైన సౌజి అనే ధారావాహికలో ఒక సైనికుడి పాత్రలో నటించారు. ఆ పాత్ర షారుక్ ఖాన్ కి మంచి పేరుని సంపాదించి పెట్టింది. అనంతరం వెంటనే సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. 1992 లో దివానా అనే సినిమాలో ఒక సహాయ నటుడి పాత్రతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత 1995లో దిల్వాలే దుల్హనియా లేజాయేంగే సినిమా అతి భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అయితే మొదట 10 రూపాయల తో ముంబై మహానగరంలో కెరీర్ మొదలుపెట్టిన షారుక్ ఖాన్ ప్రస్తుత ఆస్తుల విలువ తెలిస్తే ఆశ్చర్యపోతారు. షారుఖ్ ఖాన్ మొత్తం ఆస్తుల విలువ 11 వేలకోట్ల రూపాయలకు అటు ఇటుగా ఉంటుందని సమాచారం.
ఈయనకు ముంబైలో ఉన్నటువంటి మన్నత్ మాత్రమే కాకుండా ఢిల్లీ నుండి దుబాయ్ వరకు ఎంతో విలాసవంతమైన ఇల్లు ఉన్నాయని తెలుస్తోంది. ఇక ముంబైలో షారుక్ ఖాన్ కి ఉన్న మన్నత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఇల్లు అంటే షారుక్ ఖాన్ కి ఎంతో ఇష్టం. దీని విలువ దాదాపు 200 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. అలాగే దుబాయిలో పాం జుమేరాలో ఓ ప్రైవేట్ ద్వీపాన్ని కలిగి ఉన్నారు. దీనికి షారుక్ ఖాన్ జన్నత్ అని పేరు పెట్టారు. దీని విలువ 18 కోట్ల వరకు ఉంటుంది. అలాగే లాస్ ఎంజిల్స్ లో, జన్మస్థలమైన ఢిల్లీలో, లండన్ లోని పార్క్ లేని లో ఇలా ఈయనకు ఖరీదైన బంగ్లాలు ఉన్నాయి. బాలీవుడ్ లోని సంపన్న వంతులైన హీరోలలో షారుక్ కూడా ఒకరు కావడం గమనార్హం.