Actress : ఇటీవలి కాలంలో సెలబ్రిటీల చిన్ననాటి పిక్స్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. తమ అభిమాన నటీనటుల చిన్ననాటి పిక్స్ చూసి తెగ మురిసిపోతున్నారు ఫ్యాన్స్. అయితే తాజాగా సొట్టబుగ్గల సుందరి తాప్సీకి సంబంధించిన పిక్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ పిక్‌లో తాప్సీ క్యూట్ లుక్స్ చూసి తెగ మైమరచిపోతున్నారు. చిన్నప్పుడు ఎంత క్యూట్‌గా ఉందో ఇప్పుడు అంతే క్యూట్‌గా ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ‘ఝుమ్మంది నాదం’లో బూరెబుగ్గల భామగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది తాప్సీ పన్ను.
అందం, అభినయంతో మంచి నటిగా పేరు తెచ్చుకుని బాలీవుడ్‌లో సైతం తనను తాను నిరూపించుకున్న ఈ భామ సోషల్‌మీడియాలోనూ తెగ హల్‌చల్ చేస్తున్నది. తొలి సినిమాతోనే తన అందంతో కుర్రకారును కట్టిపడేసిందీ బ్యూటీ. అనంతరం పలు తెలుగు సినిమాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో విజయాన్ని మాత్రం అందుకోలేక బాలీవుడ్ బాట పట్టిన ఈ ఢిల్లీ భామ అక్కడ మాత్రం సక్సెస్‌ను రుచి చూసింది. బ్యాక్ టూ బ్యాక్ విజయాలతో మోస్ట్ సక్సెస్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న తాప్సీ.. నటనకు ప్రాధాన్యత ఉన్న లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌లో నటిస్తూ మెప్పించింది.
తాప్సీ తెలుగులో.. మంచు మనోజ్, మంచు విష్ణు, ప్రభాస్, రవితేజ, వెంకటేష్, గోపీచంద్ వంటి బడా హీరోల సరసన నటించింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కూడా పలు సినిమాల్లో నటించింది. తమిళంలో ఆరంభం, కాంచన 2 వంటి సినిమాల్లో నటించగా.. హిందీలో చష్మే బద్దూర్, బేబీ, పింక్ వంటి సినిమాల్లో నటించింది. తాప్సీ నటించిన మిషన్ ఇంపాజిబుల్ తో ఎంతగానో అలరించింది. ప్రస్తుతం ఈ భామ వరుస సినీ అవకాశాలతో మాత్రం దూసుకుపోతోంది . తమిళంలో రెండు, బాలీవుడ్ లో రెండు సినిమాలతో బిజీగా ఉంది.