టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హీరోయిన్లకు అస్సలు కొదువే లేదు. ఒక హీరోయిన్ కాకపోతే మరొక హీరోయిన్ సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. చాలామంది చాన్సుల కోసం ఎదురుచూస్తున్న హీరోయిన్లు కూడా ఉన్నారు. ఎక్కువగా చిత్ర పరిశ్రమంలో ముంబైకి చెందిన హీరోయిన్లు… టాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఏలుతున్నారు. అయితే ఇప్పుడు మన హీరోయిన్ల తొలి సినిమాల గురించి తెలుసుకుందాం. చందమామ సినిమాలో చందమామ కంటే అందంగా ఉంటుంది కాజల్. చిన్ని ఫేస్ తో, లంగా వోణీలో, హీరోని అరుస్తూ, ఏడిపిస్తూ, ఎమోషనల్ సీన్స్ లో కూడా బెస్ట్ ఇచ్చింది. అప్పటి యువత కింద, మీదపడిపోయారు. లక్ష్మీ కళ్యాణం లో కూడా తెలుగింటి అమ్మాయిలా భలే ఉంటుంది.
లావణ్య, అందాల రాక్షసి నుండి మనకు మిధునగా మాత్రమే తెలుసు. ఆ కుర్తీలు, దుపట్టా, వన్ సైడ్ వేసుకోవడం, లూస్ హెయిర్ లేదా లూజ్ జడ, నిలువు బొట్టు, కుంకుమ పెట్టుకుని ఇలాంటి పాత్ర ఎప్పటికీ, ఇంకెప్పటికీ రాదు. సూపర్ నుండి ఇప్పటివరకు అనుష్క టాలీవుడ్ పై ఆధిపత్యం చెలాయిస్తుంది. బాహుబలి సినిమాతో క్రేజ్ మరింత పెంచుకుంది. తమన్నా ఎన్ని సినిమాలు చేసిన హ్యాపీడేస్ పాత్ర ఎప్పుడు ప్రత్యేకమే. శేఖర్ కమ్ముల వల్ల ఇంకాస్త అందంగా అనిపించింది. చీర, స్కర్ట్, కుర్తి, టీ షర్టు అన్నిట్లో క్యూట్ గా ఉంటుంది. పూజా హెగ్డేకు ఇప్పటికీ ప్రత్యేక పాత్రలు చాలా ఉన్నాయి. కానీ ముకుంద ఎప్పుడూ ఆల్ టైం ఫేవరేట్. ఈ సినిమా మొత్తం లాంగ్ స్కర్ట్స్ తో చాలా సింపుల్ గా ఉంటుంది.
రాశి ఖాన్నా ఊహలు గుసగుసలాడేలో తెల్లటి డ్రెస్ లో ఏంజెల్ లా కనిపిస్తుంటుంది. ఈ సినిమాలో ప్రభావతి గెటప్ లో కనిపించింది. కృష్ణ గాడి వీర ప్రేమ గాథలో మెహ్రీన్ చాలా సింపుల్ గా ఉంటుంది. కాటన్ చుడీదార్లు, పటియాల, కాటుక, గజిబిజి జడ, సరైన మధ్యతరగతి అమ్మాయిలా కనిపిస్తుంది. రెజీనా.. రొటీన్ లవ్ స్టోరీ నుండి తన్వి.. ఈ సినిమాలో రెజీనా అయితే ప్లెయిన్ చీరలు, స్లీవ్ లెస్ టాప్స్, స్కార్ఫ్స్ లో సూపర్ కూల్ ఉంటుంది. సమంతకు క్రేజ్ తెచ్చిన సినిమా ఏ మాయ చేశావె. ఈ సినిమాలో జెస్సీగా సమంత అందరిని అలరించింది. అది కూడా క్రిస్టియన్ స్టైల్ వెడ్డింగ్ ఫ్రాక్, హిందూ స్టైల్ గ్రీన్ చీరలో ఒకే పాటలో కనిపించింది. ఇంత తెల్లగా ఇదేంట్రా బాబోయ్ అనుకున్నాం. సినిమా గురించి ఆరా తీస్తుంటే 16 ఏళ్లు అని తెలిసింది. సగం సినిమా కేవలం ఒకే ఒక్క కాస్ట్యూమ్ తో ఎంత క్యూట్ గా అనిపించిందో హన్సిక.