డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సినిమాతో తెలుగు పరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యాడు ఉదయ్ కిరణ్. ఇక ఉదయ్ కిరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమానే సూపర్ హిట్ కావడంతో… అందరూ ఉదయ్ కిరణ్ కు ఫ్యాన్ అయిపోయారు. ఇక వంద రోజుల పాటు చిత్రం సినిమా విజయవంతంగా ఆడింది. ఆ తర్వాత నువ్వు నేను అనే సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు ఉదయ్ కిరణ్. తన కెరీర్ను పూర్తిగా సక్సెస్ రేటు తోనే ముందుకు సాగించాడు ఉదయ్ కిరణ్.
అయితే.. ఉదయ్ కిరణ్ కెరీర్ లో చిరంజీవి కుటుంబం తో వివాదం నెలకొంది. 2014 సంవత్సరంలో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఉదయ్ కిరణ్ మృతికి కారణం… చిరంజీవి అని పలువురు ఆరోపణలు చేస్తూ ఉంటారు. అయితే దీనిపై మెగాస్టార్ ను దగ్గర నుంచి చూసిన ఓ సీనియర్ జర్నలిస్టు స్పందించారు.
ఉదయ్ కిరణ్ కు ఆఫర్లు తగ్గిన మాట వాస్తవమే కానీ ఆ కుట్ర వెనుక చిరంజీవి లేడు. చిరంజీవి ఓ తండ్రిలా ఉండే స్థితిలో ఉన్నారని ఇలాంటి వ్యూహాలు రచిస్తూ ఆయన ఇమేజ్ తగ్గుతుందని ఆయన అలా చేయాల్సిన అవసరమే లేదని వివరించారు. చిరంజీవి తన కుమార్తెను జీవితాంతం చూసుకునే వ్యక్తితో వివాహం చేయాలని కోరుకున్నారు. కానీ ఉదయ్ కిరణ్ స్థానము అలాగే కుటుంబ నేపథ్యం చిరంజీవికి సరిపోలేదని… అందుకే ఉదయ్ కిరణ్ తో తన కూతురు పెళ్లికి ఒప్పుకోలేదని చెప్పారు.
అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఉదయ్ కిరణ్ ను చంపేస్తానని బెదిరించాడు. అమ్మాయి కుటుంబ సభ్యుడిగా పవన్ కళ్యాణ్ అలా చేయడం సహజమే. ముఖ్యంగా చిరంజీవి తో ఉదయ్ కిరణ్ కు సమస్యలు ఉంటే పెళ్లి జరిగిన ఏడాదిలోపే ఆ విషయాలు బయటకు వచ్చేవి. ఉదయ్ కిరణ్ విషయంలో చిరంజీవిని నిందించడం సరైంది కాదని జర్నలిస్ట్ అభిప్రాయపడ్డారు.