తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి అండ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా కానీ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ ఫాలోయింగ్ ని అలవర్చుకున్నాడు. ఇండస్ట్రీ లో ఎంతమంది హీరోలు ఉన్నా కానీ పవనిజం అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో దూసుకుపోయే హీరో పవర్ స్టార్.. ఇప్పటికే ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసి ఎనలేని అభిమానులను సంపాదించుకున్నారు. అయితే ఆయన ప్రజా సేవ చేయడం కోసం జనసేన పార్టీ స్థాపించి రాజకీయ అరంగేట్రం చేశారు..
ఇక అప్పటి నుంచి చాలా తక్కువ గా సినిమాలు చేస్తూ పాలిటిక్స్ పై దృష్టి పెట్టారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ కి ఎంతోమంది అభిమానులు ఉన్నా కానీ, అతన్ని విమర్శించే వారు కూడా ఉన్నారు. ప్రధానంగా చాలామంది అతన్ని విమర్శ చేసేది మూడు పెళ్లిళ్ల విషయంలోనే. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడం వెనుక ఒక బలమైన కారణం ఉందట. అది ఏంటో ఇప్పుడు చూద్దాం. పవర్ స్టార్ ముందుగా నందిని అనే యువతిని వివాహమాడారు.
మొదట్లో వీరి జంట బాగానే ఉన్నా ఆ తర్వాత చిన్న చిన్న గొడవల వల్ల విడిపోయారు. ఆ తర్వాత రేణు దేశాయ్ ని వివాహమాడారు. కొద్ది రోజులు వీరి రిలేషన్ బాగానే ఉన్నా ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత వీరి మధ్య కూడా మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు.ఆ తర్వాత పవర్ స్టార్ అన్నా లెజ్నోవా ని పెళ్లి చేసుకున్నారు. ఈమె కూడా ఇంగ్లీష్ సినిమాల్లో నటించి పవన్ కళ్యాణ్ మాదిరిగానే ఎంతోమందికి సహాయం చేసి తన ఆస్తులను పోగొట్టుకుందట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎవరిని పెళ్లి చేసుకున్న ఆయన ఆలోచనలకు తగ్గట్టుగా ఉండడం లేదనే టాక్ బలంగా వినిపిస్తోంది. అందుకనే ఆయన ఇప్పటి వరకు విడాకులు ఇచ్చారట.