పవన్ కల్యాణ్ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయనకు ఎంత పేరుందో అందరికీ తెలుసు. మెగాస్టార్ చిరంజీవికి తమ్ముడైనా నటనలో మాత్రం తనదైన సత్తాను చాటి అందరి అభిమానాన్ని చూరగొన్నారు. ఆ క్రమంలోనే ఆయన పవర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. పవనిజం పేరిట ఆయన అభిమానులు ఏకంగా ఓ స్టైల్‌నే క్రియేట్ చేశారంటే పవన్ కల్యాణ్ అంటే వారికి ఎంత అభిమానముందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. జనసేన పార్టీ పెట్టి పరోక్షంగా రాజకీయాల్లోకి వచ్చినా ఆయన ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నారు. అందరి అభిమానాన్ని పొందుతూనే ఉన్నారు.
అయితే ఆయనకు అభిమానులు ఎంత మంది ఉన్నారో అంతే స్థాయిలో ఆయన్ను విమర్శించే వారు కూడా ఉన్నారు. కానీ ఎవరెన్ని చెప్పినా పవన్‌లో సినిమా యాంగిలే కాదు, స్పందించే గొప్ప హృదయం కూడా ఉంది. దాన్ని అందరూ అంగీకరించాల్సిందే. ఏవేవో కారణాలతో ఎంతో మంది వృద్ధులు చేరిన ఓ వృద్ధాశ్రమాన్ని నడపలేని అత్యంత నిస్సహాయ స్థితిలో ఉన్న ఖమ్మంకు చెందిన ఓ వృద్ధురాలు పవన్ కల్యాణ్ గురించి తెలుసుకుని హైదరాబాద్‌లో ఉన్న ఆయన ఇంటికి వచ్చింది.
ఆమె గురించిన వివరాలు తెలుసుకున్న తరువాత పవన్ ముందుగా ఆమెకు స్వయంగా భోజనం పెట్టి అనంతరం ఆమెకు కావల్సిన సహాయాన్ని అందించి తిరిగి పంపారు. ఓ టీవీ ఛానల్ వారు నిర్వహించిన కార్యక్రమంలో ఆ మహిళ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. దీన్ని బట్టి చూస్తేనే అర్థమవుతోంది పవన్ ఎంత భోళా మనిషో. నటనతోనే కాదు తోటి మనిషికి సాయం చేయాలన్న స్పందించే హృదయం కలిగిన గొప్ప వ్యక్తిగా పవన్ మనకు కనిపిస్తారు. ఆ వృద్ధురాలు పవన్ కల్యాణ్ గురించి స్వయంగా వెల్లడించిన విషయాన్ని కింది వీడియోలో చూడవచ్చు…