ఇక్కడ చాలా కారణాలు ఉన్నాయి. ఒక్కొక్కటిగా చూద్దాం. డెవలప్మెంట్ ఆగిపోవడం.. ఎందుకంటే నాలుగు భాగాల హైదరాబాద్ నగరంలో తూర్పు వైపు వారు ఎప్పటి నుంచో నివాసం ఉంటున్నారు, పడమర వైపుగా ఈ 20 సంవత్సరాల్లో సాఫ్ట్వేర్ కంపెనీలతో విస్తరించింది, ఉత్తరం వైపు కెమికల్ ప్లాంట్స్, గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అని అక్కడ పరిశ్రమలే ఉండడం వల్ల జనావాసంతో పెరగడం మొదలైంది అది పడమర, ఉత్తర రెండు దిక్కులుగా పెరిగింది. ఇప్పటి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధికి సంబంధించి ఎలాంటి అజెండాతో ముందుకెళ్లడం లేదు, అందువల్ల చేరికలు తగ్గాయి.
సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ లో చేరికల తగ్గుదల, పెరుగుదల లేకపోవడం. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ లో దాదాపు సంవత్సరం నుంచి కొలువులు తగ్గాయి, అలానే హైక్ నిలుపుదల లాంటివి ఎక్కువ ప్రభావితం చేసాయి. అందువల్ల చాలామంది EMI లకు భయపడి కొనుగోలు చాలా తగ్గించేశారు. బిల్డర్ల ఇష్టారాజ్యమైన పెంపులు.. గత ప్రభుత్వములో హైదరాబాద్ లో భూమి వేల్యూ ఎలా అంటే ఆకాశమే హద్దులే పెరిగింది, కోకాపేట, కొండాపూర్, మదీనాగూడ, ఖాజాగూడ లాంటి ఏరియాలో ఒక ఎకరం నికరంగా 60 కోట్లు పలికింది, ఇక ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ లాంటి చోట్ల అయితే 65 పైచిలుకు. అలాంటప్పుడు అక్కడ అపార్ట్మెంట్స్ కడితే ఒక చదరపు అడుగు పైన కనీసం 10 వేల వరకు పెడితే కానీ గిట్టుబాటు అవదు, అది కూడా ప్రీ లాంచ్ కింద. అలాంటప్పుడు మీకు ఒక గేటెడ్ కమ్యూనిటీలో 2 పడకల గది కావాలన్నా GST, టాక్స్, రిజిస్ట్రేషన్ అన్ని పోగా కనీస ధర కోటిన్నర, ఇక మై హోమ్, అపర్ణ లాంటి వెంచర్లలో అయితే 2 కోట్ల పైచిలుకు.
అలాంటప్పుడు ఒక సాధారణ జీతగాడు 20% పేమెంట్ కట్టి 80% EMI పెట్టి అది తీసుకున్నా చెల్లించాల్సిన మొత్తం వచ్చి అపార్ట్మెంట్ ధర పైన కనీసం 60 లక్షల పై చిలుకు, అలాంటప్పుడు వాడేలా బతగ్గలడు, ఏం తినగలడు. కానీ రెగ్యులేటరీ అథారిటీ కి ఇవేమి పట్టవు. బిల్డర్లు ఇచ్చే డబ్బులతో పబ్బం గడుపుకునే వ్యవస్థ, ఇక గవర్నమెంట్ వార్డులేండి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. హైడ్రా పేరిట అడ్డగోలు కూలగొట్టడాలు.. అసలు హైడ్రా అనే సంస్థ లిగాలిటీస్, రెగ్యులేషన్స్, ఆక్షన్ ప్లాన్, డేటా ఏవి లేకుండా, పరిధి ఏది తెలీకుండా ఎక్కడ పడితే అక్కడ కూలగొట్టడాలు జరుగుతున్నాయి, అది కూడా చిన్న, మధ్యస్థమైన బిల్డర్లు చేపట్టినవే. అదే చెరువుల దగ్గర ఆకాశ హర్మ్యాలు కట్టి పబ్బం గడుపుతున్న పెద్ద నాయకులు, బిల్డర్లు, కొండలను తవ్వి ఇల్లు కట్టిన సదరు పెద్ద మనుషుల వరకు వెళ్లకుండా చిన్నా చితకా మధ్య తరగతి వారి పైన చూపిస్తున్న ప్రతాపమిదంతా, సెక్షన్ 7 కింద నోటీసు ఇవ్వడం 48 గంటల్లో కూల్చడం కొన్ని చోట్ల అయితే నోటీసు కూడా ఇవ్వకుండా కూల్చివేతలు జరుగుతున్నాయి.
అసలు ఇప్పుడు మనం చుస్తే తెల్లాపూర్ లో మై హోమ్ ప్రాజెక్ట్ అంతా చెరువు పరిధిలో ఉంది, అలానే మల్లారెడ్డి కాలేజీ అంతా చెరువు ఆక్రమించుకుని కట్టిన కట్టడం, ఒవైసి కాలేజీ అంతా చెరువును బూడ్చి కట్టినదే, అక్కడిదాకా పోతే గండిపెట్ టీడీపీ ఆఫీస్ చెరువును తొలిచి కట్టిందే దాని జోలికి వెళ్ళకుండా చిన్న వాటర్ బాడీస్, కుంటలు ఉన్న ఏరియాలో, అవి ఎండిపోతే పర్మిషన్ తెచ్చుకుని కట్టినపుడు సెక్షన్ 90 కింద దానికి ఎక్సమ్ప్షన్ ఇచ్చి రెగ్యులేటరీ మానిటారైజెషన్ చేసి టాక్స్ వాసులు చేసి వదిలిపెట్టాలి. అలా జరగకుండా అడ్డగోలు కూల్చివేతలుంటే తెలిసి తెలిసి ఎవరు కొనుక్కునే సాహసం చేయరు. ఇష్టారాజ్యమైన పన్నులు.. హైదరాబాద్ మునిసిపల్ అథారిటీలో ఒక పేరు చెప్పకూడదు కానీ ఒక గేటెడ్ కమ్యూనిటీలో కరెంట్ బిల్ 8 వేలు, ఇంటికి నోటీసు వస్తుంది మీటర్ చెక్ లేదా తిరిగి అడిగే సౌలభ్యం కూడా లేదు. పార్కింగ్ ఫీ నెలకు 8 వేలు, మైంటెనెన్సు 5 వేలు. అడిగితే ప్రీమియం అంటారు, అలాంటప్పుడు అక్కడ ఒక ఉద్యోగి చేరి 20 వేల పైన మైంటెనెన్సు కూడా 25 వేలు రెంట్ వెరసి 50 వేలు అద్దె కట్టాలి.అదే ఒక స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ లో కూడా బాడుగ కరెంట్, మెయింటనెన్స్ వగైరా అన్ని కలిపి ఖర్చు 35 వేల పైచిలుకే అలాంటప్పుడు లక్ష రూపాయల జీతం కూడా ఒక పక్కకు సరిపోదు, అందువల్ల కాస్ట్ తక్కువ ఉన్న ఏరియాలో ఉంటూ అప్ అండ్ డౌన్ చేస్తున్నవారు ఎందరో. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. అందువల్ల ఇవన్నీ కుదురుకుంటే కానీ పరిస్థితులు సరిగ్గా మసలవు.