చాలాసార్లు ఇంటిలోనే ఒక జిమ్ వుంటే ఎంత బాగుండు. ఇంట్లోని అందరి ఆరోగ్యాలు జిమ్ వ్యాయామాలతో ఎంతో బాగుంటాయి అని భావిస్తూ వుంటాం. ఇంటిలో జిమ్ ఏర్పరచుకోవడం ఎంతో కష్టం కాదు. తక్కువ వ్యయంతో ఇంటిలో ఒక జిమ్ ఏర్పరచటం ఎలా? పరిశీలించండి. బరువులుగా ఎత్తేటందుకుగాను ఇసుక బస్తాలు లేదా కంకర రాయి బస్తాలవంటివి పెట్టుకోండి. ఇవి భుజాల బలానికి బాగా ఉపకరిస్తాయి. సాధారణంగా అందరూ వాడతారు. వ్యయం చాలా తక్కువ. పెద్దవైన ప్లాస్టిక్ బాటిల్స్ కూడా ఇసుకతో నింపి పెట్టుకుని వెయిట్ లిఫ్టింగ్ కు ఉపయోగించవచ్చు.
పొట్ట వ్యాయామాలు చేసేందుకు ఒక బెంచ్ ఏర్పాటు చేయండి. దానిపై ఒక చెక్క వేయాలి. దాని కొలతలు రెండు అంగుళాల మందం ఒక అడుగు వెడల్పు సుమారు 6 అడుగుల పొడవు వుంటే సరిపోతుంది. దానిని బెంచిపై వుంచండి. చివరలకు ప్లాస్టిక్ పైపులు లేదా గట్టి మెటల్ పైపులు పెట్టి ఏటవాలుగా బిగించి మీ పొట్ట వ్యాయామాలకు అనుకూలంగా చేయండి. పుల్ అప్స్ తీయడానికిగాను రెండు గోడలపై అడ్డంగా ఒక గట్టి చెక్క పోల్ వేయండి. ఇది చాలా తక్కువ వ్యయంలో ఏర్పడుతుంది.
నేటిరోజులలో వ్యాయామం చేయటం మనకు కావలసిన శరీర రూపం పొందటం చాలా తేలిక పని. ఇంటిలోనే జిమ్ వస్తువులు వుంటే, ఏ సమయంలో అయినా సరే చేసుకోవచ్చు. దూరప్రదేశాలకు వెళ్ళి జిమ్ లలో చేరి వ్యయం చేసి ఆరోగ్యం పొందాల్సిన పనిలేదు. కుటుంబ సభ్యులు అందరూ కూడా చేయవచ్చు. ఏ రకమైన వ్యయంలేకుండానే మంచి ఆరోగ్యం పొందవచ్చు. జిమ్ ఏర్పాటుకు సిద్ధంగా లేనివారు, యోగాసనాలు, ఏరోబిక్ వ్యాయామాలు వంటివి కూడా చేసి ఆరోగ్యం పొందవచ్చు.