బరువు తగ్గడం అనేది చాలా మందికి కష్టమైన పనే. దీన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించాల్సిందే. దీంతో డైటింగ్ నుంచి వ్యాయామం వరకు బరువు తగ్గేందుకు చాలా మంది అనేక రకాల మార్గాలను అనుసరిస్తుంటారు. అయితే జపాన్‌కు చెందిన ఓ రకమైన టవల్ ఎక్సర్‌సైజ్‌ను చేయడం వల్ల పొట్ట దగ్గరి కొవ్వుతోపాటు అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. మరి వ్యాయామాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. మొదట ఒక టవల్ ను తీసుకుని దానిని రోల్ చేయాలి. చుట్టి మడతపెట్టాలి.
2. నేలమీద కూర్చుని మీ కాళ్లను మీ ముందు చాపి రెండు పాదాల మధ్య 8-10 ఇంచుల దూరం ఉండేలా చూసుకోండి. ఇప్పుడు రోల్ చేసిన టవల్‌ను మీ వెనుక పెట్టుకోండి.
3. మీ నడుము కింద టవల్‌ను ఉంచండి. వెనక్కి వెల్లకిలా పడుకోండి. కాలి మడమల మధ్య దూరాన్ని కొనసాగిస్తూ మీ కాలి వేళ్ళను ఒకదానికొకటి దగ్గరగా తీసుకోండి. మీ పాదాలను పైకి చూపే త్రిభుజం లాగా ఉంచాలి. చిత్రంలో చూస్తే మీకు అర్థమవుతుంది.
4. తరువాత మీ చేతులను ఎత్తి వాటితో నమస్కరిస్తున్నట్లు పెట్టి వాటిని తల వెనకగా పెట్టండి.
5. ఇలా 5 నిమిషాల పాటు ఈ స్థితిలో ఉండాలి.
ఈ వ్యాయామం చేసేటప్పుడు కడుపులో మంట లేదా నొప్పి వస్తాయి. అది సహజమనే క్రమంగా చేస్తుంటే అలవాటు అవుతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. పొట్ట దగ్గరి కొవ్వు కరుగుతుంది.
ఈ వ్యాయామాన్ని జపాన్‌కు చెందిన డాక్టర్ ఫుకూట్సుడ్జి సూచించారు. డాక్టర్ ఫుకూట్సుడ్జి ప్రకారం, ఈ రకమైన భంగిమ బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఉదర కండరాలను బలోపేతం చేస్తుంది. వెన్ను నొప్పిని తగ్గిస్తుంది.