జీవిత భాగస్వామి లేదా గాల్ ఫ్రెండ్ తో కలిసి వర్కవుట్లు చేయటం ఎంతో ధ్రిల్లింగ్ గా వుంటుంది. వ్యాయామం ఎపుడెపుడే చేసేద్దామా అని వుంటుంది. ఒంటిరిగా చేసి బోర్ అనిపించుకోకుండా, జంటగా మంచి మ్యూజిక్ వింటూ వర్కవుట్లు చేస్తే, శరీరానికి ఆరోగ్యమే కాదు, మనసుకి ఉల్లాసంగా కూడా వుంటుంది. అంతేకాదు, జంటలు కొంత సమయం ఉపయోగకరంగాను గడిపినట్లు వుంటుంది. జంటలు చేసే వర్కవుట్లు ఎలా వుండాలో చూద్దాం . జంటలు సాధారణంగా డ్యాన్స్ చేయటానికి ఎక్కువ మక్కువ చూపుతారు. శరీరంలో కొవ్వును కరిగిస్తుంది. బరువు తగ్గటమే కాక, డ్యాన్స్ చేసే నైపుణ్యాన్ని సంపాదించి, పార్టీలు, వెడ్డింగ్ సందర్భాలలో ప్రదర్శన కూడా ఇవ్వవచ్చు.
సల్సా, టాప్ డ్యాన్సింగ్, జివింగ్ వంటివి కొన్ని జంటలు కలసి చేయదగినవిగా వుంటాయి. ఉదయంవేళ ఒక్కరే జోగింగ్ కు వెళ్ళ్ళి వెళ్ళి బోర్ కొట్టేసిందా? మీ పార్టనర్ ని కూడా వెంట తీసుకెళ్ళండి. జాగ్ చేస్తూనే ఎన్నో విషయాలు మాట్లాడుకోవచ్చు. శరీరంలో కొవ్వు కరిగించుకోవచ్చు. కనుక మీ చెవిలో హెడ్ ఫోన్ తీసేసి, పార్టనర్ ని పక్కన పెట్టుకొని జాగ్ చేసి ఆనందించండి. బరువు తగ్గటానికి చాలా తేలికైన వ్యాయమం. కేలరీలు బాగా ఖర్చవుతాయి. కాలి కండరాలు ప్రత్యేకించి తొడ కండరాలు బలపడతాయి. సైకిలింగ్ లో మీ పార్టనర్ తో కొంత సమయం ఆనందించి అందులో వున్న మజా అనుభవించండి.
రిలాక్స్ అవ్వాలంటూ ఒక్కరే స్విమ్మింగ్ కు వెళితే కొద్ది రోజులయ్యే సరికి విసుగనిపిస్తుంది. మీ పార్టనర్ ని కూడా తీసుకెళ్ళండి. మజాగా వుండటమే కాక, ఆరోగ్యం అద్భుతంగా వచ్చేస్తుంది. అధిక కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. ఈ వ్యాయామంలో జంటలు కలసి మరింత రిలాక్స్ కావచ్చు. ఇద్దరికి ఆటలంటే ఇష్టమా? టెన్నిస్ ఎంతో హుషారు పుట్టిస్తుంది. శరీరం మంచి షేప్ లోకి వచ్చేస్తుంది. రోజంతా చురుకుగా వుంచుతుంది. ఈ ఆట వ్యాయామంగా ఎంతో ఆసక్తి కలిగిస్తుంది. జంటగా మీ భాగస్వామితో కలిసి చేయదగిన వర్కవుట్ల ప్రత్యామ్నాయంగా ఈ క్రీడలను ఎంచుకొని, ఆరోగ్యం, ఆనందం, కలసి పంచుకోండి. వర్కవుట్ల తర్వాత ప్రతిరోజూ 8 నుండి 10 గ్లాసుల నీరు తాగండి. ఇది మీ శరీరాన్ని కాపాడటమే కాక, వ్యర్ధాలను విసర్జిస్తుంది.