Jaggery Milk : పాలు, బెల్లం.. రెండూ మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. వీటిని విడి విడిగా తీసుకునే బదులు కలిపి ఒకేసారి తీసుకోవచ్చు. రాత్రి పూట ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కొద్దిగా బెల్లం కలిపి తాగడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. వీటిల్లో అనేక పోషకాలు ఉంటాయి కనుక మనకు అనేక ప్రయోజనాలను అందిస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. పాలలో అనేక పోషకాలు ఉంటాయి. కాల్షియం, విటమిన్లు ఎ, బి, ప్రోటీన్లు, ఇతర పోషకాలు ఉంటాయి. అందువల్ల పాలను తాగితే ఎన్నో లాభాలు కలుగుతాయి. ఇక బెల్లం సహజసిద్ధంగా తయారవుతుంది కాబట్టి వాటిల్లోనూ మన పోషకాలను పొందవచ్చు. శరీరాన్ని అంతర్గతంగా శుభ్రం చేయడంలో బెల్లం బాగా పనిచేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. అందువల్ల పాలలో బెల్లం కలుపుకుని రోజూ రాత్రి తాగాలి.
2. పాలలో బెల్లం కలిపి తాగడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. మహిళలకు రుతు సమయంలో వచ్చే సమస్యలు తగ్గుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
3. బెల్లం కలిపిన పాలను తాగడం వల్ల శరీరానికి ఐరన్ లభిస్తుంది. దీంతో శరీరంలో రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. గర్భిణీలకు ఇది ఎంతగానో మేలు చేస్తుంది. శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. నీరసం, అలసట తగ్గుతాయి. యాక్టివ్‌గా ఉంటారు.
4. బెల్లం కలిపిన పాలను తాగడం వల్ల శరీరం అంతర్గతంగా శుభ్రం కావడమే కాదు, రక్తం కూడా శుద్ధి అవుతుంది. రక్తంలో ఉండే వ్యర్థాలు, విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరానికి ఎలాంటి హాని కలగకుండా కాపాడుకోవచ్చు.
5. పాలలో బెల్లం కలిపి తాగితే వాటిల్లోని పోషకాలు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. ఇది చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా మార్చి రక్షిస్తుంది. పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ ఎక్స్‌ఫోలియేటింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. చర్మాన్ని మృదువుగా ఉంచేందుకు అవసరం అయిన ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తుంది. కనుక పాలలో బెల్లం కలిపి తాగితే చర్మాన్ని సంరక్షించుకోవచ్చు.
6. బెల్లం కలిపిన పాలలో అమైనో యాసిడ్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని తేమగా ఉంచేందుకు సహాయ పడతాయి. అందువల్ల చలికాలంలో వచ్చే పగుళ్ల నుంచి రక్షణ లభిస్తుంది. చర్మం మృదువుగా ఉంటుంది. పగలకుండా రక్షించుకోవచ్చు. చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.
7. అజీర్ణ సమస్య ఉన్నవారు బెల్లం కలిపిన పాలను తాగడం వల్ల ఆ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. మలబద్దకం నుంచి బయట పడవచ్చు.
8. పాలలో కాల్షియం అధికంగా ఉంటుంది కనుక ఈ పాలను తాగితే చిన్నారులు, పెద్దల్లో ఎముకలు, దంతాలు దృఢంగా మారుతాయి. శరీరానికి విటమిన్ డి లభిస్తుంది. ఇది ఎముకలను బలంగా మారుస్తుంది. స్త్రీలకు రుతు సమయంలో వచ్చే కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
9. రోజూ వ్యాయామం చేసేవారు బెల్లం పాలను తాగడం వల్ల కండరాలు పటిష్టంగా మారుతాయి. రోజూ శారీరక శ్రమ చేసే వారు కూడా ఈ పాలను తాగితే మేలు జరుగుతుంది. అధిక బరువు తగ్గాలని చూస్తున్న వారు రోజూ బెల్లం పాలను తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. శరీర మెటబాలిజం పెరిగి కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.
10. బెల్లం కలిపిన పాలను తాగడం వల్ల ఆ మిశ్రమంలో ఉండే పొటాషియం బీపీని తగ్గిస్తుంది. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళనల నుంచి బయట పడేస్తుంది. మనస్సును ప్రశాంతంగా మారుస్తుంది. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
11. కీళ్ల నొప్పులు ఉన్నవారు బెల్లం పాలను రోజూ తాగితే ఆ నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. దీంతోపాటు వాపులు కూడా తగ్గుతాయి.
అయితే ఈ మిశ్రమం వల్ల కొందరికి అలర్జీలు రావచ్చు. కనుక అలా గనుక జరిగితే వెంటనే ఈ విధంగా తాగడం మానేయాల్సి ఉంటుంది. డాక్టర్ సూచన మేరకు ఈ సలహాను పాటించాలి. పాల వల్ల కొందరికి అలర్జీ ఉంటుంది. అలాంటి వారు కూడా ఈ మిశ్రమాన్ని తాగరాదు.