Attraction : స్త్రీ, పురుషుల మధ్య ఆకర్షణ అనేది ఎలా కలుగుతుందో ఎవరికీ తెలియదు. ఒకరు అంటే ఒకరికి ఇష్టం అనేక రకాల కారణాల వల్ల ఏర్పడుతుంది. అయితే పురుషులు మాత్రం కొన్ని విధాలుగా ఉంటే వారి పట్ల స్త్రీలు ఎక్కువగా ఆకర్షితులవుతారట. మరి అందుకు పురుషులు ఏ విధంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. పురుషుడు మెడను, గడ్డాన్ని వంచే భంగిమను బట్టి స్త్రీలు వారి పట్ల ఆకర్షితులవుతారట. పురుషులు మెడను, గడ్డాన్ని కొన్ని ప్రత్యేకమైన భంగిమల్లో పెడితే వారికి స్త్రీలు ఇట్టే ఆకర్షితులవుతారట.
2. ఎల్లప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే పురుషులు అంటే స్త్రీలు ఎక్కువగా ఇష్టపడుతారని సైంటిస్టులు చేసిన పరిశోధనల్లో ప్రయోగాత్మకంగా వెల్లడైంది.
3. ఉంగరపు వేలి పొడవు ఎక్కువగా ఉండే పురుషుల పట్ల స్త్రీలు ఎక్కువగా ఆకర్షితులవుతారని జెనీవా యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల పరిశోధనల్లో తేలింది.
4. ముఖంపై గాటు ఉండే పురుషులు అంటే స్త్రీలు ఎక్కువగా ఇష్ట పడుతారట. అలాంటి వారు తమను రక్షిస్తారనే ధైర్యం స్త్రీలకు ఉంటుందట.
5. ఇక కొందరు స్త్రీలకు గడ్డం లేకుండా క్లీన్ షేవ్ ఉండే వారంటే ఇష్టం ఉంటుందట. కొందరికి మాత్రం గడ్డం నిండుగా ఉండే పురుషులు అంటే ఇష్టంగా ఉంటుందట.