మన శరీరంలో రక్తం ఎన్నో విధులు నిర్వర్తిస్తుంది. ఆక్సిజన్‌ను, హార్మోన్లను, చక్కెరలు, కొవ్వులను కణాలకు రవాణా చేయడంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచేందుకు, శరీరాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచేందుకు రక్తం ఉపయోగపడుతుంది. రోజూ మనం తినే ఆహారాలతోపాటు కాలుష్యం, ఒత్తిడి కారణంగా శరీరంలో విష పదార్థాలు పేరుకుపోతుంటాయి. ఈ క్రమంలో వ్యర్థాలను తొలగించే ప్రక్రియ జరుగుతుంది. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇక మన శరీరంలోని ఊపిరితిత్తులు, కిడ్నీలు, లివర్ రక్తాన్ని శుద్ధి చేసేందుకు నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. అయితే కొన్ని రకాల ఆహారాలను రోజూ తీసుకోవడం వల్ల ఈ ప్రక్రియ మరింత సులభతరం అవుతుంది. శరీరంలోని వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లిపోతాయి. దీంతో రక్తం శుద్ధి అవుతుంది.
రక్తాన్ని శుద్ధి చేసే ఆహారాలను రోజూ తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు ఉండవు. చర్మం పొడిబారడం తగ్గుతుంది. పలు అనారోగ్య సమస్యలు, చర్మ సమసయలు రాకుండా ఉంటాయి. అలర్జీలు, తలనొప్పి, వికారం వంటి సమస్యలు తగ్గుతాయి. కిడ్నీలు, గుండె, లివర్, ఊపిరితిత్తులు, లింఫాటిక్ వ్యవస్థకు ఆరోగ్యకరమైన రక్తం అవసరం. అందువల్ల రక్తాన్ని శుద్ధి చేయాలి. దీంతో ఊపిరితిత్తుల నుంచి కార్బన్ డయాక్సైడ్ బయటకు వెళ్లిపోతుంది. ఊపిరితిత్తులు శుభ్రంగా ఉంటాయి. రక్తం శుభ్రంగా మారడం వల్ల శరీర పీహెచ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ద్రవాలు, ఉష్ణోగ్రత సమతుల్యంలో ఉంటాయి. శరీరం ఆరోగ్యంగా ఉంటే తెల్ల రక్త కణాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. దీంతో గాయాలు అయినప్పుడు రక్తస్రావం ఎక్కువగా జరగకుండా ఉంటుంది. అలాగే ప్లేట్‌లెట్‌ల సంఖ్య సరైన స్థితిలో ఉంటుంది.
1. యాపిల్, జామ పండ్లతోపాటు, టమాటాలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్తం శుద్ది అవుతుంది. శరీరంలో ఉండే భార లోహాలు, ఇతర హానికర రసాయనాలు, వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. టమాటాల్లో ఉండే లైకోపీన్ గ్లుటథియోన్ వ్యర్థాలు, రసాయనాలను బయటకు పంపుతుంది. అలాగే ఇతర తాజా పండ్లు, కూరగాయలను కూడా తరచూ తీసుకుంటుండాలి.
2. ఆకుకూరల్లో అనేక పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి అనారోగ్యాలను దూరంగా ఉంచుతాయి. పాలకూర, క్యాబేజీ వంటి ఆకుకూరలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. దీని వల్ల రక్త సరఫరా మెరుగు పడుతుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. రక్తం శుభ్రంగా మారుతుంది.
3. బీట్‌రూట్‌లో సహజసిద్ధమైన నైట్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వాపులను తగ్గిస్తాయి. లివర్ దెబ్బ తినకుండా చూస్తాయి. బీట్‌రూట్ జ్యూస్‌ను రోజూ తాగడం వల్ల శరీరం రోజూ సహజసిద్దంగా శుభ్రమవుతుంది. శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. రక్తం శుద్ది అవుతుంది. రక్తం బాగా ఉత్పత్తి అవుతుంది.
4. భారతీయులందరి ఇళ్లలోనూ బెల్లం ఉంటుంది. ఇది సహజసిద్ధమైన బ్లడ్ ప్యూరిఫైర్‌గా పనిచేస్తుంది. బెల్లంలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను శుభ్రం చేస్తుంది. మలబద్దకాన్ని రానీయదు. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. బెల్లంలో ఉండే ఐరన్ హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. దీంతో రక్తం ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలోని విష పదార్థాలు బయటకు పోతాయి. రక్తం శుద్ధి అవుతుంది.
5. రక్తాన్ని శుద్ది చేసే అత్యంత సహజసిద్ధమైన పదార్థాల్లో నీరు ఒకటి. రోజూ తగినంత మోతాదులో నీటిని తాగడం వల్ల శరీరంలో ఉండే వ్యర్థాలు, విష పదార్థాలు బయటకు పోతాయి. అలాగే అవయవాలు సరిగ్గా పనిచేస్తాయి. రక్తం శుద్ధి అవుతుంది. రోజూ గోరు వెచ్చని నీటిని తాగాలి. అలాగే రాగి పాత్రలో నిల్వ ఉంచిని నీటిని తాగితే మేలు. దీని వల్ల శరీరంలో చెడు రక్తం శుద్ధి అయి ఆరోగ్యంగా మారుతుంది.
6. శరీరంలోని వాపులను తగ్గించే సహజసిద్ధమైన పదార్థంగా పసుపు పనిచేస్తుంది. ఇది లివర్ పనితీరును మెరుగు పరుస్తుంది. పసుపులో ఉండే కర్‌క్యుమిన్ అనబడే సమ్మేళం అనేక సమస్యలపై పోరాటం చేస్తుంది. పసుపును రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. రక్తం శుభ్రంగా మారుతుంది.
7. రోజూ ఉదయాన్నే పరగడుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ నిమ్మరసం కలిపి తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లడమే కాదు, రక్తం శుభ్రంగా మారుతుంది. కొవ్వును సంశ్లేషణ చేయడంలో నిమ్మరసం పనిచేస్తుంది. దీంతో బరువు తగ్గుతారు. కిడ్నీలపై పడే భారం తగ్గుతుంది. నిమ్మరసంలో ఉండే విటమిన్లు, మినరల్స్ శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపుతాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365