ప్రస్తుతం మనకు అనేక రకాల డైట్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో వెగన్ డైట్ కూడా ఒకటి. వెగన్ డైట్ అంటే ఏమీ లేదు. కేవలం శాకాహార పదార్థాలను మాత్రమే తినాలి. అంటే కేవలం వృక్ష సంబంధ పదార్థాలను మాత్రమే తినాలి. జంతు సంబంధ పదార్థాలను తినరాదు. ఈ క్రమంలోనే వెగన్ డైట్‌లో ఏమేం పదార్థాలను తినాలి, ఏమేం ఆహారాలను తినకూడదు, వెగన్ డైట్ వల్ల కలిగే లాభాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పండ్లు, కూరగాయలు, పప్పు దినుసులు, బఠానీలు, బీన్స్, చిక్కుడు జాతి గింజలు, నట్స్, సీడ్స్, బ్రెడ్, రైస్, పాస్తా, సోయా మిల్క్, కొబ్బరిపాలు, బాదం పాలు, వెజిటబుల్ ఆయిల్స్ ను వెగన్ డైట్‌లో తీసుకోవచ్చు.
బీఫ్, పోర్క్, మటన్, చికెన్, చేపలు, ఇతర మాంసాహారాలు, కోడిగుడ్లు, చీజ్, వెన్న, పాలు, పాల మీద మీగడ, ఇతర పాల ఉత్పత్తులను తీసుకోరాదు.
* శాకాహార డైట్‌ను పాటించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది.
* శాకాహార డైట్ వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని సైంటిస్టులు తమ పరిశోధనల ద్వారా తెలిపారు.
* శాకాహార డైట్ వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయని, కొలెస్ట్రాల్ తగ్గుతుందని, హైబీపీ తగ్గుతుందని తెలిపారు.
* డయాబెటిస్, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయి.
* అధిక బరువు పెరగకుండా ఉంటారు. కొవ్వు చేరకుండా ఉంటుంది.
* వెగన్ డైట్ వల్ల ఎక్కువ కాలం జీవించవచ్చని సైంటిస్టుల అధ్యయనాల్లో వెల్లడైంది.