Badam Besan Laddu : లడ్డూలు అంటే అందరికీ ఎంతో ఇష్టంగా ఉంటుంది. వాటిని చాలా మంది ఇష్టంగా తింటారు. లడ్డూల్లో మనకు అనేక రకాలైనవి అందుబాటులో ఉన్నాయి. బూందీ లడ్డూ, తొక్కుడు లడ్డూ.. ఇలా చేస్తుంటారు. రకరకాల లడ్డూలు మనకు బయట కూడా లభిస్తుంటాయి. అయితే బాదంపప్పుతోనూ మనం ఎంతో రుచికరమైన లడ్డూలను చేసుకోవచ్చు. ఇవి కూడా ఎంతో రుచిగా ఉంటాయి. అందరికీ నచ్చుతాయి. తయారు చేయడం కూడా సులభమే. వీటిని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బాదం బేసన్ లడ్డూల తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగ పిండి – ఒక కప్పు, రవ్వ – అర కప్పు, చక్కెర – అర కప్పు, నెయ్యి – ముప్పావు కప్పు, బాదం పప్పు – అర కప్పు, యాలకుల పొడి – అర టీస్పూన్.
బాదం బేసన్ లడ్డూలను తయారు చేసే విధానం..
ఓ బాణలిలో నెయ్యి వేసి బాదం పలుకులను వేయించాలి. అవి చల్లారాక మిక్సీలో వేసి పొడిగా చేయాలి. మరో మందపాటి బాణలిలో నెయ్యి వేసి కాగాక శనగ పిండి, రవ్వ వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. తరువాత బాదం పొడిని కూడా కలిపి వేయించి పక్కన పెట్టాలి. కాస్త చల్లారాక అందులో యాలకుల పొడి, చక్కెర కూడా వేసి బాగా కలిపి కాస్త వేడిగా ఉన్నప్పుడే లడ్డూలలా చుట్టుకోవాలి. ఒక్కో లడ్డూపై బాదం పలుకులను గార్నిష్ చేయాలి. దీంతో ఎంతో రుచికరమైన బాదం బేసన్ లడ్డూలు రెడీ అవుతాయి. ఎప్పుడూ చేసే లడ్డూలకు బదులుగా ఇలా లడ్డూలను ఒకసారి ట్రై చేయండి. ఎంతో బాగుంటాయి. అందరికీ నచ్చుతాయి. ఇష్టంగా తింటారు.