food

హెల్ది అయిన ‘బీట్ రూట్ సమోసా’ ఎలా తయారు చేసుకోవాలి అంటే …!

<p style&equals;"text-align&colon; justify&semi;">బీట్ రూట్ లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి&period; ఇది ఆరోగ్యవంతమైన ఆహారం&period; దీనిని తరచుగా తినడం వల్ల రక్తం శుద్ది అవుతుంది&period;శరీరానికి శక్తిని ఇస్తుంది&period; అయితే వాటిని ఉపయోగించటానికి ముందు బాగా కడగాలి&period; అయితే బీట్ రూట్ కూరని అందరు ఇష్టపడరు&period; అందుకే అలాంటివారి కోసం వెరైటీగా బీట్ రూట్ సమోసా తయారి చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తయారికి కావలసిన పదార్థాలు&colon;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బీట్ రూట్ 1 కప్పు ఉడికించి పెట్టాలి&period; బంగాళదుంపలు 2 ఉడికించి పొట్టు తీయాలి&period; సన్నగా తరిగిన ఉల్లిపాయలు &half; కప్పు&comma; పచ్చి మిర్చి 4&comma; కొత్తిమీర 1 కప్పు&comma; మైదా 3 కప్పులు&comma; నెయ్యి 3 స్పూన్లు&comma; ఉప్పు రుచికి సరిపడా&comma; కారం 1 స్పూన్&comma; నూనె డీప్ ఫ్రై కి సరిపడా&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71407 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;beetroot-samosa&period;jpg" alt&equals;"how to make beetroot healthy samosa recipe in telugu " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తయారి విధానం&colon;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మైదా లో వేడివేడి నెయ్యి వేసి&comma; ఉప్పు కలిపి నీరు పోస్తూ పూరీ పిండిలా కలిపి ఉంచాలి&period; ఉడికించిన దుంపలను చిన్న ముక్కలుగా కట్ చేయాలి&period; స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నాలుగు స్పూన్ల నూనె వేసి ఉల్లి&comma; పచ్చి మిర్చి ముక్కలు వేసి వేయించాలి&period; తరువాత దుంపలను వేసి ఉప్పు&comma; కారం వేసి బాగా కలపాలి&period; కూర దగ్గరగా అవుతున్నప్పుడు కొత్తిమీర కలిపి దించాలి&period; మైదా మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేసుకోవాలి&period; ఒక్కో ఉండని పూరీలాగా ఒత్తుకుని మధ్యకు కట్ చేయాలి&period; ఒక్కో ముక్కను కోన్ ఆకారంలో చుట్టి అందులో బీట్ రూట్ కూరను పెట్టి అంచులను తడి చేతితో నొక్కాలి&period; అలా చేసుకున్న వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి&period; అంతే బీట్ రూట్ సమోసాలు రెడీ&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts