Tomato Dosa : ఎంతో రుచికరమైన టమాటా దోశ.. తయారీ ఇలా.. పోషకాలు కూడా లభిస్తాయి..!

Tomato Dosa : టమాటాలు మన నిత్య జీవితంలో భాగం అయ్యాయి. వీటిని మనం నిత్యం పలు రకాల కూరల్లో వేస్తుంటాం. ఇతర కూరగాయలతో కలిపి వీటిని వండి తింటుంటాం. ఇక వీటితో కూడా నేరుగా కొన్ని రకాల వంటలను చేస్తుంటాం. అయితే టమాటాలతో దోశలను కూడా వేసుకోవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. సరిగ్గా చేయాలే కానీ సాధారణ దోశ కన్నా టమాటా దోశలే ఎంతో రుచిగా ఉంటాయి. ఇక టమాటా దోశలను ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.

టమాటా దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..

బియ్యం – ముప్పావు కప్పు, సన్నగా తరిగిన టమాటాలు – 3, మినప పప్పు – అర కప్పు, ఎండు మిర్చి – 3, ధనియాలు – 2 టీస్పూన్లు, ఉప్పు – తగినంత, నూనె – 4 టేబుల్‌ స్పూన్లు, నీళ్లు – 2 కప్పులు.

make Tomato Dosa in this way very healthy easy to prepare
Tomato Dosa

టమాటా దోశను తయారు చేసే విధానం..

ఒక పాత్రలో నీటిని తీసుకుని బియ్యం వేసి నానబెట్టాలి. ఇంకో పాత్రలోనూ నీటిని తీసుకుని అందులో మినప పప్పును నానబెట్టాలి. రెండింటినీ ఇలా వేర్వేరుగా 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టాలి. తరువాత రెండింటినీ కలిపి ఆ మిశ్రమంలోనే ధనియాలు, తరిగిన టమాటాలు, ఎండు మిర్చి వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. పిండి చాలా మృదువుగా, మెత్తగా వచ్చే వరకు మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఆ పిండిని ఒక పాత్రలోకి తీసుకుని అందులో కాస్త ఉప్పు వేసి బాగా కలపాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని 30 నుంచి 45 నిమిషాల పాటు పక్కన పెట్టాలి.

ఇప్పుడు ఒక పెనం తీసుకుని మీడియం మంటపై వేడి చేయాలి. దానిపై కాస్త నూనె వేసి వేడయ్యాక పిండి తీసుకుని దోశలా పోయాలి. అనంతరం మళ్లీ కాస్త నూనె వేసి కాల్చాలి. ఇప్పుడు దోశను రెండు వైపులా తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి. దీంతో టమాటా దోశ రెడీ అవుతుంది. దీన్ని నేరుగా తినవచ్చు. లేదా కొబ్బరి చట్నీ, పల్లి చట్నీతో తినవచ్చు. ఇలా టమాటా దోశను తయారు చేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. పైగా టమాటాల్లోని పోషకాలను పొందవచ్చు.

Share
Editor

Recent Posts