స్ట్రాబెర్రీలు, పుచ్చకాయలు.. మన శరీరానికి చలువ చేస్తాయి. అంతేకాదు, ఈ రెండు పండ్లలో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో విటమిన్లు, మినరల్స్ కూడా ఉంటాయి. అందువల్ల ఈ రెండింటితో స్మూతీ తయారు చేసుకుని సేవిస్తే.. శరీరానికి కొత్త శక్తి, ఉత్సాహం, ఉత్తేజం వస్తాయి. శరీరం చల్లగా కూడా ఉంటుంది. మరింకెందుకాలస్యం.. వాటర్‌మిలన్, స్ట్రాబెర్రీ స్మూతీని తయారు చేయడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందామా.
వాటర్‌మిలన్, స్ట్రాబెర్రీ స్మూతీ తయారీకి కావల్సిన పదార్థాలు:
స్ట్రాబెర్రీలు – 100 గ్రాములు, తేనె – 1 టేబుల్ స్పూన్, పెరుగు – 150 గ్రాములు, పుచ్చకాయ ముక్కలు – 50 గ్రాములు, చియా సీడ్స్ (టాపింగ్ కోసం) – 1/4 కప్పు.
వాటర్‌మిలన్, స్ట్రాబెర్రీ స్మూతీ తయారు చేసే విధానం:
పైన చెప్పిన అన్ని పదార్థాలను కలిపి బ్లెండర్లో వేసి మిశ్రమంగా పట్టుకోవాలి. స్మూతీ తయారవుతుంది. దాన్ని ఒక గ్లాస్లో పోయాలి. అనంతరం పైన చియా సీడ్స్ ను టాపింగ్ వేయాలి. తాగేటప్పుడు చియా సీడ్స్‌ను కలుపుకుని తాగాలి.