Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వ్యాయామం

వాకింగ్ లేదా ర‌న్నింగ్ చేసేట‌ప్పుడు కామ‌న్‌గా అయ్యే గాయ‌లు ఇవే తెలుసా..?

Admin by Admin
December 10, 2024
in వ్యాయామం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

వాకింగ్ లేదా ర‌న్నింగ్‌. రెండింటిలో ఏది చేసినా అది మ‌న‌కు శారీర‌క దృఢ‌త్వాన్ని ఇస్తుంది. దాంతో బ‌రువు త‌గ్గ‌డ‌మే కాదు, అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. అయితే ముఖ్యంగా వాకింగ్ క‌న్నా ర‌న్నింగ్ చేస్తే ఎక్కువ వేగంగా క్యాల‌రీలు ఖ‌ర్చ‌వుతాయి. బ‌రువు త‌గ్గుతారు. ఎక్స‌ర్‌సైజ్ ప‌రంగా ఈ రెండింటిలో ఎవ‌రైనా త‌మ అన‌కూల‌త‌ల‌ను బ‌ట్టి దేన్న‌యినా చేయ‌వ‌చ్చు. అయితే వాకింగ్ లేదా ర‌న్నింగ్ ఏది చేసినా ఇవి రెండు సుర‌క్షిత‌మైన ఎక్స‌ర్‌సైజ్‌లే. వీటి వ‌ల్ల మ‌నం పెద్ద‌గా ఇబ్బందులు ప‌డాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. కానీ కొన్ని సంద‌ర్భాల్లో వీటి వ‌ల్ల గాయాల‌కు గుర‌య్యేందుకు అవ‌కాశం ఉంటుంది. అవి ఏ త‌ర‌హా గాయాలో, అవి కాకుండా ఉండేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ప్లాంటార్ ఫ‌సైటిస్ ( Plantar Fasciitis)

ఈ త‌ర‌హా గాయం ఎందుకు అవుతుందంటే క‌రెక్ట్‌గా ఫిట్ అవ‌ని ఫుట్‌వేర్ వేసుకుని వాకింగ్ లేదా ర‌న్నింగ్ చేస్తే ఇలాంటి గాయాలు అవుతాయి. పాదం ముందు భాగంలో కింద ఉండే క‌ణ‌జాలం దెబ్బ తింటుంది. క‌నుక స‌రైన ఫుట్‌వేర్ వాడితే ఈ గాయం బారిన ప‌డాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.

2. ఏకిల్లెస్ టెండినోప‌తి (Achilles Tendinopathy)

పిక్క‌ల‌కు మ‌డ‌మ‌ల‌కు మ‌ధ్య ఉండే ఈ భాగంలో ఈ గాయం అవుతుంది. ఎక్కువ‌గా మ‌డ‌మ‌ల‌ను ఉప‌యోగించి వాకింగ్ లేదా ర‌న్నింగ్ చేస్తే ఈ స‌మ‌స్య వ‌స్తుంది. క‌నుక పాదాల‌ను నేల‌పై బ్యాలెన్స్ చేస్తూ వాకింగ్ లేదా ర‌న్నింగ్ చేయాలి. దీంతో ఈ గాయం అవ‌దు.

3. షిన్ స్ల్పింట్స్ (Shin Splints)

కాలు ముందు, లోప‌లి భాగంలో నొప్పి వ‌స్తుంది. ఈ త‌ర‌హా గాయం ఎందుకు అవుతుందంటే ఒకే త‌ర‌హా నేల‌పై కాకుండా వివిధ ర‌కాల నేల‌ల‌పై ఎక్కువ సేపు వాకింగ్ లేదా ర‌న్నింగ్ చేస్తే ఇలాంటి నొప్పి వ‌స్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఒకే రూపంలో ఉండే నేల‌పైనే ఎక్సర్‌సైజ్ చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ స‌మ‌స్య రాదు.

these common injuries will occur when walking and running

4. ర‌న్న‌ర్స్ నీ (Runner’s Knee)

మోకాళ్లలో నొప్పి వ‌స్తుంది. దీన్నే ర‌న్న‌ర్స్ నీ అని అంటారు. ఈ త‌ర‌హా గాయం ఎందుకు అవుతుందంటే ర‌న్నింగ్ చేసే వారు ఎక్కువ‌గా మోకాళ్ల‌పై బ‌రువు మోపితే ఇలా అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఆ భాగంపై అంత బ‌రువు వేయ‌వ‌ద్దు. దీంతో స‌మ‌స్య ఉత్ప‌న్నం కాదు.

5. ఇలియోటిబియ‌ల్ బ్యాండ్ సిండ్రోమ్ (Iliotibial Band Syndrome)

తొడ నుంచి మోకాలి మ‌ధ్య భాగంలో ఈ గాయం అవుతుంది. నొప్పి వ‌స్తుంది. అయితే ఇది స‌హ‌జ‌మే. ఈ నొప్పి సాధార‌ణంగా వాకింగ్‌, ర‌న్నింగ్ ప్రారంభంలో లేదా చివ‌ర్లో వ‌స్తుంది. కొంత సేపు రెస్ట్ తీసుకుంటే చాలు పోతుంది.

6. మ‌జిల్ పుల్ (Muscle Pull)

తొడ కండ‌రాలు, పిక్క‌లు ప‌ట్టేస్తాయి. ఈ గాయం ఎందుకు అవుతుందంటే ఆయా కండరాల‌పై ఒత్తిడి ఎక్కువ‌గా ప‌డితే మ‌జిల్ పుల్ వ‌స్తుంది. కొంత సేపు రెస్ట్ తీసుకుంటే దీన్నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

7. స్ట్రెస్ ఫ్రాక్చ‌ర్ (Stress Fracture)

వాకింగ్ లేదా ర‌న్నింగ్ ఒకే వేగంతో చేయ‌కుండా వెంట వెంట‌నే మార్చి మార్చి వేగాల‌తో చేస్తే ఈ గాయం అవుతుంది. అలా కాకుండా ఒకే వేగంతో కాన్‌స్టంట్‌గా వాకింగ్ లేదా రన్నింగ్ చేస్తే ఎలాంటి స‌మ‌స్య రాదు.

8. లోయ‌ర్ బ్యాక్ పెయిన్ (Lower Back Pain)

వాకింగ్ లేదా ర‌న్నింగ్ చేసేట‌ప్పుడు స‌రైన భంగిమ‌లో శ‌రీరాన్ని ఉంచుకుండా అడ్డ దిడ్డంగా ఉంచుతూ ఎక్స‌ర్‌సైజ్ చేస్తే ఈ త‌ర‌హా గాయం అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఎక్స‌ర్‌సైజ్ చేసేట‌ప్పుడు క‌రెక్ట్ భంగిమ‌ను మెయింటెయిన్ చేయాలి. దీంతో ఈ స‌మ‌స్య రాదు.

Tags: walking and running
Previous Post

ఉత్సాహాన్ని, శ‌క్తిని ఇచ్చే.. చ‌ల్ల చ‌ల్ల‌ని వాటర్‌మిల‌న్‌, స్ట్రాబెర్రీ స్మూతీ..!

Next Post

కాలేజీ బంక్ కొట్టడానికి స్టూడెంట్స్ చెప్పే ఈ 8 వింత కారణాలు చూస్తే నవ్వాపుకోలేరు.! మీరైతే ఏం చెప్తారు.?

Related Posts

హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను రోజూ తింటే చాలు.. మీ ర‌క్తం శుభ్రంగా మారుతుంది..!

July 5, 2025
వ్యాయామం

మీ ఇంట్లోనే ఈ వ్యాయామాల‌ను చేయండి.. పైసా ఖ‌ర్చు లేకుండా బ‌రువు త‌గ్గుతారు..!

July 5, 2025
ప్ర‌శ్న - స‌మాధానం

4 ఏళ్ల నుంచి షుగ‌ర్‌కు మందులు వాడుతున్నా.. ఆయుర్వేద మందులతో త‌గ్గుతుందా..?

July 5, 2025
వినోదం

కేవ‌లం క‌న్య‌ల‌కు మాత్ర‌మే ప్ర‌వేశం ఉన్న ఆల‌యం అది.. ఆ ఊర్లో ఉంది.. త‌రువాత ఏమైంది..?

July 5, 2025
viral news

అంతర్వేదిలో స్నానానికి వెళ్లొద్దని పోలీసుల హెచ్చరిక..ఆ నీళ్లలో ఏముంది?

July 5, 2025
Off Beat

పని చెయ్యకపోతే… అంతే సంగతులు.. ఫ‌న్నీ స్టోరీ..!

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.