Saggubiyyam Laddu : సగ్గుబియ్యం అనగానే మనకు వాటితో చేసే పాయసం గుర్తుకు వస్తాయి. వాస్తవానికి ఆయుర్వేదం పరంగా సగ్గు బియ్యం మనకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. అయితే వీటితో ఎంతో రుచికరమైన స్వీట్ కూడా తయారు చేయవచ్చు. ఇది చాలా బాగుంటుంది. అందరికీ నచ్చుతుంది. ఇక ఈ స్వీట్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సగ్గుబియ్యం లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు..
సగ్గుబియ్యం – ఒక కప్పు, నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు, జీడిపప్పు పలుకులు – రెండు టేబుల్ స్పూన్లు, చక్కెర – ఒకటింపావు కప్పు, ఆరెంజ్ ఫుడ్ కలర్ – చిటికెడు, బొంబాయి రవ్వ – రెండు టేబుల్ స్పూన్లు.
సగ్గుబియ్యం లడ్డూలను తయారు చేసే విధానం..
అరగంట ముందు సగ్గు బియ్యాన్ని నానబెట్టుకుని ఆ తరువాత నీటిని పూర్తిగా వంపేయాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు పలుకుల్ని వేయించి తీసుకోవాలి. అదే బాణలిలో నానబెట్టుకున్న సగ్గుబియ్యం, రవ్వ వేసి తడిపోయే వరకు వేయించుకుని చక్కెర వేయాలి. చక్కెర కరిగాక ఆరెంజ్ ఫుడ్ కలర్, జీడిపప్పు పలుకులు, మిగిలిన నెయ్యి వేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే కాసేపటికి ఈ మిశ్రమం దగ్గరకు అవుతుంది. అప్పుడు దింపేసి వేడి కొద్దిగా చల్లారాక లడ్డూల్లా చుట్టుకుంటే సరిపోతుంది. ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం లడ్డూలు రెడీ అవుతాయి. వీటిని అందరూ ఇష్టంగా తింటారు.