Honey : మనం తీపి పదార్థాల తయారీలో చక్కెరను, బెల్లాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. చక్కెర, బెల్లం లేని రోజులలో తీపి పదార్థాలను తయారు చేయడానికి తేనెను ఉపయోగించే వారు. తేనె మనందరికీ తెలిసిందే. తేనె వల్ల కలిగే ప్రయోజనాలు, తేనెలో ఉండే ఔషధ గుణాలు అన్నీ ఇన్నీ కావు. ఆయుర్వేదంలో తేనెను ఉపయోగించి అనేక రకాల ఔషధాలను తయారు చేస్తూ ఉంటారు. మనకు వచ్చే అనారోగ్య సమస్యలను తగ్గించడంలో తేనె ఎంతో ఉపయోగపడుతుంది. ప్రకృతి ప్రసాదించిన బలవర్ధకమైన ఆహారాల్లో తేనె ఒకటి. ఒక పెద్ద తేనె తెట్టె నుండి 5 నుంచి 10 కిలోల వరకు తేనె లభిస్తుందట.
తేనె తెట్టె ఉండే ప్రదేశాన్ని బట్టి పట్టు తేనె, పుట్ట తేనె, పుల్ల తేనె, పెద్ద తేనె, తొర్ర తేనె అని పిలుస్తూ ఉంటారు. తేనెలో కాల్షియం, పొటాషియం, కాపర్, ఐరన్, మెగ్నిషియం, జింక్, సోడియం వంటి మినరల్స్ ఉంటాయి. వీటితోపాటు శరీరానికి ఎంతో అవసరమయ్యే విటమిన్స్, ప్రోటీన్స్ కూడా తేనెలో ఉంటాయి. తేనెను వాడడం వల్ల స్త్రీ, పురుషులిద్దరిలోనూ లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. ఉదయం ఒక టీ స్పూన్ తేనెలో ఒక టీ స్పూన్ అల్లం రసాన్ని కలిపి తాగడం వల్ల రక్త శుద్ది అవుతుంది. తేనెను వాడడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఎంత చెప్పినా తక్కువే.
తేనె శ్వాస కోస సంబంధిత సమస్యలను తగ్గించే దివ్య ఔషధమని ఆయుర్వేదంలో చెప్పారు. ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ తేనె, నిమ్మ రసాన్ని కలుపుకుని తాగడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఇలా తాగడం వల్ల నీరసం తగ్గుతుంది. చర్మంపై ఉండే ముడతలు తొలపోయి చర్మం కాంతివంతగా తయారవుతుంది. అకాల వృద్ధాప్యం రాకుంగా ఉంటుంది.
లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.
రక్తంలో తెల్ల రక్త కణాలను పెంచడంలో, జ్ఞాపక శక్తిని పెంచడంలో తేనె ఉపయోగపడుతుంది. మానసిక స్థితిని మెరుగుపరిచే గుణం కూడా తేనెకు ఉంది. సాధారణ దగ్గు, జలుబు, జ్వరం వంటి వాటిని తగ్గించడంలో కూడా తేనె సహాయపడుతుంది. చక్కెర, బెల్లానికి బదులుగా తేనెను వాడడం వల్ల అధిక లాభాలను పొందవచ్చని, కల్తీ లేని స్వచ్ఛమైన తేనెను వాడడం వల్ల మాత్రమే ఈ ప్రయోజనాలను పొందవచ్చని.. ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.