Camel Milk : ప్రస్తుత కాలంలో డయాబెటిస్ తో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందనే చెప్పవచ్చు. మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా వచ్చే అనారోగ్య సమస్యల్లో ఇది ఒకటి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. డయాబెటిస్ బారిన పడితే జీవితాంతం మందులు మింగాల్సిన పరిస్థితి నెలకొంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల షుగర్ వ్యాధి వస్తుంది. శాస్త్రవేత్తలు ఇప్పటికీ అనేక పరిశోధనలను ఈ వ్యాధిపై జరుపుతున్నారు. శాస్త్రవేత్తలు తాజాగా జరిపిన పరిశోధనల్లో ఒక అసాధారణమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల మనం రక్తంలో అదుపులో ఉంచుకోవచ్చని వెల్లడైంది. ఈ ఆహారం సంచార జీవనం చేసే వారికి ప్రధాన ఆహారంగా ఉంటుంది. ఆ ఆహారం మరేమిటో కాదు ఒంటె పాలు. అవును మీరు విన్నది నిజమే, ఒంటె పాలను ఆహారంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మన దేశంలో వీటి వాడకం ఎక్కువగా లేనప్పటికి గల్ఫ్ దేశాల్లో వీటి వాడకం ఎక్కువగా ఉంటుంది. ఒంటె పాలు, అలాగే పాల పొడి ఆన్ లైన్ లో విరివిరిగి లభిస్తాయి. ఒంటె పాలల్లో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి. ఒంటె పాలల్లో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు యాంటీ మైక్రోబయాల్ గుణాలు కూడా ఉన్నాయి. ఆవు పాలల్లో , ఒంటె పాలల్లో దాదాపు సమానమైన పోషకాలు ఉన్నప్పటికి ఒంటె పాలల్లో విభిన్న ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు కనుగొన్నారు. ఒంటె పాలల్లో విటమిన్ సి తో శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయి. అలాగే ఒంటెపాలు త్వరగా జీర్ణమయ్యే గుణాన్ని కూడా కలిగి ఉన్నాయి. అధిక రక్తపోటును తగ్గించడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో, ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడంలో ఒంటెపాలు చక్కగా పని చేస్తాయని నిపుణులు కనుగొన్నారు.
అలాగే ఒంటె పాలల్లో ఇన్సులిన్ లాంటి ప్రోటీన్లు ఉన్నాయని అందుకే ఇవి డయాబెటిస్ ను అదుపులో ఉంచడంలో సహాయపడతాయని వారు చెబుతున్నారు. 4 కప్పుల ఒంటె పాలు 52 యూనిట్ల ఇన్సులిన్ తో సమానమైనదని వారు తెలియజేస్తున్నారు. టైప్ 2 డయాబెటిస్ తో బాధపడే వారికి ఒంటె పాలు ఇచ్చి జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైందని వారు చెబుతున్నారు. ఒంటె పాలు తాగిన వారిలో రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉన్నాయని వారు కనుగొన్నారు. డయాబెటిస్ తో బాధపడే వారు రోజుకు 500 ఎమ్ ఎల్ ఒంటె పాలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఒంటె పాలల్లో ఇన్సులిన్ నానో పార్టికల్స్ రూపంలో ఉంటుంది. ఇది చిన్న ప్రేగు ద్వారా త్వరగా గ్రహించబడి త్వరగా రక్తంలో కలుస్తుంది.
అలాగే ఈ పాలల్లో ఉండే లైసోజెమ్, లాక్టోఫెర్రిన్ అనే ఎంజైమ్ లు కూడా మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఎంతో అవసరం. ఒంటె పాలను తాగడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉండడంతో పాటు వీటిని తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో నొప్పులు, వాపులు తగ్గుతాయి. ఈ విధంగా ఒంటె పాలు మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఎంతగానో ఉపయోగపడతాయని వీటిని తాగడం వల్ల చాలా సులభంగా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.