Chicken : చికెన్ అంటే మాంసాహార ప్రియులు చాలా మందికి ఇష్టంగానే ఉంటుంది. ఈ క్రమంలోనే చికెన్‌తో అనేక రకాల వంటకాలను తయారు చేసుకుని తింటుంటారు. ఇక కొందరు చికెన్‌తో కూర చేసుకుని తింటే కొందరు బిర్యానీ అంటే ఇష్టపడతారు. అలాగే కొందరు చికెన్ ఫ్రై అంటే ఇష్టం చూపిస్తారు. అయితే ప్రస్తుత తరుణంలో చాలా మంది చికెన్‌ను స్కిన్ లెస్ రూపంలో స్కిన్ తీసేసి తింటున్నారు. కానీ కొందరు చికెన్ స్కిన్‌ను తినాలని.. అది చాలా మంచిదని చెబుతుంటారు. మరి ఇందులో అసలు నిజం ఎంత ఉంది ? చికెన్‌ను స్కిన్‌తో తినాలా ? స్కిన్ తీసేసి తినాలా ? అసలు ఎలా తింటే మంచిది ? దీనిపై వైద్యులు ఏమంటున్నారు ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ స్కిన్‌లో అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మంచిది కాదనే వాదన ఎప్పటి నుంచో ఉంది. వీటివల్ల గుండె జబ్బులు వస్తాయని కొందరు నిపుణులు చెబుతుంటారు. అయితే ఇందుకు శాస్త్రీయ ఆధారాలు లేవని మరికొందరు నిపుణులు చెబుతుంటారు. మరైతే నిజం ఏమిటి ? అంటే.. పోషకాహార నిపుణులు చెబుతున్న ప్రకారం అయితే.. చికెన్ స్కిన్‌లోనూ మన శరీరానికి కావల్సిన పోషకాలు ఉంటాయి. కాబట్టి చికెన్ స్కిన్‌ను తినవచ్చు. కానీ అందులో అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి కనుక స్కిన్‌ను తక్కువగా తినాలి. దీంతో శరీరానికి ఎలాంటి హాని కలగకుండా పోషకాలను పొందవచ్చు.

ఇక చికెన్ స్కిన్‌ను పరిమిత మోతాదులో తింటే మన శరీరానికి జరిగే నష్టమేమీ ఉండదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కానీ అధికంగా సేవిస్తే శరీరంలో కొవ్వు పేరుకుపోయి అధికంగా బరువు పెరుగుతారని.. దీంతో డయాబెటిస్, గుండె జబ్బులు వస్తాయని అంటున్నారు. కనుక చికెన్ స్కిన్‌ను తిన్నా ఆరోగ్యంగా ఉండాలంటే.. దాన్ని తక్కువ మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా చికెన్‌ను స్కిన్‌తో సహా తింటూ దాని రుచిని ఆస్వాదించవచ్చు. మరోవైపు పోషకాలను కూడా పొందవచ్చు. కానీ పరిమిత మోతాదులో తీసుకుంటేనే ఎలాంటి నష్టం జరగకుండా ఉంటుంది.