Cloves For Men : మన ఇంటి వైపు ఒకసారి చూస్తే అందులో అనేక రకాల పోపు దినుసులు కనిపిస్తాయి. వాటిల్లో లవంగాలు కూడా ఒకటి. లవంగాలను చాలా మంది అనేక రకాల వంటల్లో వేస్తుంటారు. లవంగాల వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. లవంగాలను ఎక్కువగా మసాలా వంటల్లో వేస్తుంటారు. వెజ్‌లో ఏవైన మసాలా వంటకాలను చేస్తే.. లేదంటే నాన్ వెజ్ వంటల్లో లవంగాల వాడకం ఎక్కువగా ఉంటుంది. అయితే లవంగాలను తినడం వల్ల మనకు ఎంతగానో ప్రయోజనం ఉంటుందని ఆయుర్వేదం చెబుతోంది. ముఖ్యంగా రాత్రిపూట నిద్రకు ముందు ఒక్క లవంగం తిన్నా చాలు.. ఎన్నో విధాలుగా ప్రయోజనం పొందవచ్చని వైద్యులు అంటున్నారు. ఇక లవంగాల వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది పురుషులకు శీఘ్ర స్ఖలనం సమస్య ఉంటుంది. అంటే శృంగారంలో పాల్గొన్న వెంటనే కాసేపటికే వీర్యం పడిపోతుందన్నమాట. దీంతో వారు రతిలో ఎక్కువ సేపు పాల్గొనలేరు. అయితే రాత్రి పూట నిద్రకు ముందు ఒక లవంగం నమిలితే చాలు.. ఈ సమస్య నుంచి బయట పడవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. రాత్రి నిద్రకు ముందు లవంగాన్ని నమిలితే శీఘ్ర స్ఖలనం సమస్య నుంచి బయట పడడమే కాదు, పురుషుల్లో శృంగార సామర్థ్యం కూడా పెరుగుతుంది. కనుక లవంగాలను రోజూ తినాలి. ముఖ్యంగా పురుషులు రాత్రి పూట వీటిని తప్పనిసరిగా తినాల్సి ఉంటుంది.
శృంగారంలో చురుగ్గా పాల్గొంటారు..
లవంగాలను పురుషులు తినడం వల్ల వారిలో జననావయవాలకు రక్త సరఫరా పెరుగుతుంది. దీంతో అంగ స్తంభన సమస్య నుంచి పురుషులు బయట పడవచ్చు. శృంగారంలో చురుగ్గా పాల్గొంటారు. లవంగాలను తినడం వల్ల పురుషుల్లో వీర్యం ఎక్కువగా తయారవుతుంది. శుక్రకణాలు ఆరోగ్యంగా, చురుగ్గా ఉంటాయి. లవంగాలను రోజూ రాత్రి నిద్రకు ముందు తినడం వల్ల మరుసటి రోజు ఉదయం ఫాస్టింగ్ షుగర్ లెవల్స్ తక్కువగా ఉంటాయని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది. కనుక లవంగాలను రోజూ రాత్రి షుగర్ పేషెంట్లు తినాల్సి ఉంటుంది.
లవంగాల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ రాకుండా మనల్ని రక్షిస్తాయి. క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా చూస్తాయి. లవంగాలను నమలడం వల్ల దంతాలు, చిగుళ్ల నొప్పి తగ్గుతుంది. అలాగే నోటి దుర్వాసన నుంచి విముక్తి లభిస్తుంది. కనుక రాత్రిపూట లవంగాలను తినడం ఎంతగానో మేలు చేస్తుంది. దీంతో పైన తెలిపిన ప్రయోజనాలను పొందవచ్చు. కనుక రోజూ రాత్రి ఒక లవంగాన్ని తినడం మాత్రం మరిచిపోకండి.