Toenail Fungus Home Remedies : ఫంగస్ అనేది మన శరీరంలో ఏ భాగానికైనా సరే వ్యాప్తి చెందవచ్చు. దీంతో ఆ భాగంలో దురద వస్తుంది. చర్మం రంగు మారుతుంది. అయితే ముఖ్యంగా మనకు కాలి బొటనవేలు, చూపుడు వేలు మధ్యలో ఈ ఫంగస్ ఎక్కువగా వస్తుంటుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. కారణాలు ఏమున్నప్పటికీ ఈ బొటనవేలి గోరు ఫంగస్ వస్తే కనుక చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ భాగంలో తీవ్రమైన నొప్పి కలుగుతుంది. సరిగ్గా నడవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. ఇక ఈ ఫంగస్‌నే Toenail Fungus అని లేదా Onychomycosis అని కూడా అంటారు. సాధారణంగా ఇలాంటి ఫంగస్ వస్తే డాక్టర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. అయితే పలు చిట్కాలను ఉపయోగించి కూడా ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. ఇక ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Toenail Fungus నుంచి బయట పడేలా చేయడంలో టీ ట్రీ ఆయిల్ ఎంతగానో పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. మనకు మార్కెట్‌లో టీ ట్రీ ఆయిల్ లభిస్తుంది. దీన్ని కొని తెచ్చుకుని కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్‌ను నేరుగా సంబంధిత ప్రదేశంపై వేయాలి. కొన్ని గంటల పాటు అలాగే ఉంచాలి. దీంతో టీ ట్రీ ఆయిల్ అక్కడి చర్మం లోపలికి వెళ్లి ఫంగస్‌ను చంపేస్తుంది. ఇలా తరచూ చేస్తుంటే Toenail Fungus ను తగ్గించుకోవచ్చు. ఇక ఇందుకు మనకు విక్స్ వేపోరబ్ కూడా ఉపయోగపడుతుంది. దీన్ని ఎలా ఉపయోగించాలంటే..
విక్స్ వేపోరబ్ వాడవచ్చు..
రాత్రి పూట నిద్రకు ముందు కాళ్లను బాగా కడిగి తడి లేకుండా తుడవాలి. అనంతరం సమస్య ఉన్న కాలి బొటనవేలికి విక్స్ వేపోరబ్‌ను రాయాలి. తరువాత పాదాలకు సాక్స్‌లను వేసుకోవాలి. మరుసటి రోజు ఉదయం కాళ్లను కడిగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే ఈ ఫంగస్ బారి నుంచి ఉపశమనం లభిస్తుంది. అదేవిధంగా యాపిల్ సైడర్ వెనిగర్‌తోనూ ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అందుకు ఏం చేయాలంటే.. ఒక బకెట్ తీసుకుని అందులో పాదాలు మునిగే వరకు నీళ్లను పోసి అందులో కొన్ని చుక్కల యాపిల్ సైడర్ వెనిగర్ వేయాలి. అనంతరం అందులో పాదాలను మునిగేలా ఉంచి 20 నుంచి 30 నిమిషాల పాటు అలాగే పెట్టాలి. తరువాత పాదాలను బయటకు తీసి కడిగేయాలి. అనంతరం తడి లేకుండా శుభ్రంగా తుడవాలి. ఇలా చేస్తుండడం వల్ల కూడా ఈ ఫంగస్ తగ్గిపోతుంది.
2 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను కలిపి పేస్ట్ లా చేసి ఆ మిశ్రమాన్ని ఫంగస్ ఉన్న చోట రాయాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. అనంతరం నీళ్లతో కడుక్కోవాలి. ఇలా చేస్తుండడం వల్ల Toenail Fungus నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలను తీసుకుని దంచి పేస్ట్‌లా చేసి ఆ మిశ్రమాన్ని పాదాలపై రాయవచ్చు. లేదా వెల్లుల్లి రెబ్బలను వేసి మరిగించిన నీటిలో పాదాలను 30 నిమిషాల పాటు ఉంచాలి. ఇలా ఈ రెండింటిలో ఏవిధంగా అయినా సరే వెల్లుల్లిని ఉపయోగిస్తే ఈ ఫంగస్ నుంచి బయట పడవచ్చు.
కొబ్బరినూనె..
ఈ సమస్య నుంచి బయట పడేలా చేసేందుకు కొబ్బరినూనె కూడా ఎంతగానో పనిచేస్తుంది. సమస్య ఉన్న చోట కొబ్బరినూనెను రోజుకు 2 సార్లు రాస్తుండాలి. కొబ్బరినూనెలో కూడా సహజసిద్ధమైన యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఇది ఫంగస్‌ను నాశనం చేస్తుంది. సమస్యను తగ్గిస్తుంది. ఇలా ఈ చిట్కాలను పాటించడం వల్ల ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. అయితే Toenail Fungus ఎంతకూ తగ్గకపోతే డాక్టర్ వద్దకు వెళ్లి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో వారు సరైన మందులను ఇస్తారు. దీని వల్ల సమస్య నుంచి బయట పడవచ్చు.