Cloves With Warm Water : రాత్రి నిద్రపోయే ముందు 2 లవంగాల‌ను తిని గోరు వెచ్చ‌ని నీరు తాగండి.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Cloves With Warm Water : మ‌న వంట గ‌దిలో ఉండే మ‌సాలా దినుసుల్లో ల‌వంగాలు ఒక‌టి. ల‌వంగాలు ఘాటైన రుచిని క‌లిగి ఉంటాయి. వంట‌ల్లో వీటిని మ‌నం విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. ల‌వంగాలు వేయ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెరుగుతుంద‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. ప్ర‌తి ఒక్క‌రి వంట గ‌దిలో ల‌వంగాలు ఖ‌చ్చితంగా ఉంటాయి. చ‌క్క‌టి రుచితో పాటు ల‌వంగాలు ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను క‌లిగి ఉన్నాయి. ల‌వంగాల‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవచ్చు. అయితే ల‌వంగాల‌ను ఎలా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంది..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ల‌వంగాల్లో యాంటీ బ్యాక్టీరియ‌ల్, యాంటీ వైరల్ ల‌క్ష‌ణాలు పుష్క‌లంగా ఉంటాయి. అలాగే వీటిలో పొటాషియం, క్యాల్షియం, ఐర‌న్ వంటి ఎన్నో పోష‌కాలు ఉంటాయి.

ఉద‌యాన్నే ఖాళీ క‌డుపుతో ఒక‌టి లేదా రెండు ల‌వంగాల‌ను తిని ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిని తాగ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ల‌వంగాల‌ను ఖాళీ క‌డుపుతో తీసుకోవ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. శ‌రీరంలో ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ వ్య‌వ‌స్థ స‌క్ర‌మంగా ప‌ని చేస్తుంది. నిద్ర‌లేమిని త‌గ్గించ‌డంలో కూడా ల‌వంగాలు ఎంతో దోహ‌ద‌ప‌డ‌తాయి. రాత్రి ప‌డుకునే ముందు ఒక ల‌వంగాన్ని తిన‌డం వ‌ల్ల చ‌క్క‌టి నిద్ర‌ను సొంతం చేసుకోవ‌చ్చు. దంతాల స‌మ‌స్య‌ల‌ను దూరం చేయ‌డంలో కూడా ల‌వంగాలు స‌హాయ‌ప‌డ‌తాయి. రోజూ రాత్రి ప‌డుకునే ముందు నోట్లో ల‌వంగాన్ని ఉంచుకుని చ‌ప్పరిస్తూ నిద్ర‌పోవాలి. ఇలా నిద్ర‌పోవ‌డం వ‌ల్ల క్ర‌మం త‌ప్ప‌కుండా చేయ‌డం వ‌ల్ల దంతాల నొప్పులు త‌గ్గుతాయి. దంతాల సున్నిత‌త్వం త‌గ్గుతుంది. దంతాలు పుచ్చిపోకుండా ఉంటాయి. అధిక బ‌రువుతో బాధ‌ప‌డే వారు రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున ఒక‌టి లేదా రెండు ల‌వంగాల‌ను తిన‌డం వ‌ల్ల అధిక బ‌రువు స‌మ‌స్య నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

Cloves With Warm Water take them in this way for better results
Cloves With Warm Water

ల‌వంగాలు శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వును క‌రిగించ‌డంలో ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. ల‌వంగాల‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల ఒక నెల‌రోజుల్లోనే 6 నుండి 7 కిలోల బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. అలాగే ల‌వంగాల‌ను తిన‌డం వ‌ల్ల ర‌క్త‌పోటు అదుపులో ఉంటుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఇన్ఫెక్ష‌న్ లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉంటాము. జీర్ణ‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారికి కూడా ల‌వంగాలు ఎంతో మేలు చేస్తాయి. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌ను త‌గ్గించ‌డంలో ఇవి అద్భుతంగా ప‌ని చేస్తాయి. ఎముకల‌ను ధృడంగా ఉంచ‌డంలో, కాలేయ ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో, త‌ల‌నొప్పిని త‌గ్గించ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా ల‌వంగాలు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. వీటిని ప్ర‌తిరోజూ ఖాళీ క‌డుపున తీసుకోవ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts