మేమిద్దరం ఉద్యోగస్తులమే… ఆఫీసులకు పొద్దున్న వెళ్లి రాత్రికి తిరిగివస్తాం… హడావుడిగా రాత్రి భోజనం చేసి పడకగదికి వెళ్లగానే నీరసం మమ్మల్ని వెంటాడుతుంది.., మాకు తెలియకుండానే నిద్రమత్తులోకి జారుకుంటున్నాం. దింతో మా శృంగార జీవితం సాఫీగా సాగటం లేదు’ – ఓ దంపతులు వైద్యుల వద్ద మొరపెట్టకున్న సమస్య. ఉద్యోగం చేసే దంపతులు సాయంత్రానికి నీరసపడటం సహజమే. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీస్ కార్యకలపాల్లో నిమగ్నమయ్యే వీరు తమకు తెలియకుండానే నీరసపడిపోతారు.
ఇలాంటి సమస్యతో భాదపడుతున్న వారి కోసం లండన్ పరిశోధకులు చక్కటి ప్రకృతి సిద్ధమైన ఔషుధాన్ని ఓ సర్వే ద్వారా కనిపెట్టగలిగారు. నీరసంతో విశ్రాంతి కోరుకునే శరీరం కలవారు రోజు ఒక గ్లాసుడు దానిమ్మరసం తాగితే ముడుచుకుపోయిన వారి శరీరం ఎగిరి గంతేస్తుందట. అంతేకాదండోయ్ దానిమ్మ రసం త్రాగటంవల్ల శుద్ధికాబడిన రక్తం ఔషధ గుణాల సామర్ధ్యతతో శృంగార ప్రేరేపిత అవయవాలకు ప్రసారితమై శృంగార సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందట.
ప్రకృతి ప్రసాదించిన దానిమ్మ పండులో శృంగార ప్రేరిపిత తత్వాలున్నట్లు పరిశోధకులు గుర్తించారు. దానిమ్మ రసం శరీరానికి ఎన్నో విధాలుగా మేలుచేస్తుందని ఇదువరికే పలువురు వైద్యలు నిరూపించారు. ప్రతి రోజు ఒక దానిమ్మపండును తింటే రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుందట. అలాగే పలు రకాలు క్యాన్సర్లతో పాటు హృద్రోగ సమస్యలను దానిమ్మ నివారిస్తుందట.