Daily One Clove : రోజూ ఒక్క ల‌వంగం చాలు.. అద్భుతాలు చేస్తుంది..!

Daily One Clove : మ‌నం ఎక్కువ‌గా తీసుకునే ఆహారాన్ని మ‌నం శ‌రీరం కొవ్వుగా మార్చి కొవ్వు క‌ణాల్లో నిల్వ ఉంచుతుంది. మ‌నం చేసే శ్ర‌మ కంటే ఎక్కువ‌గా ఆహారాన్ని తీసుకున్న‌ప్పుడు ఈ ఆహారం కొవ్వుగా మారి శ‌రీరంలో నిల్వ ఉంటుంది. మ‌న శ‌రీరంలో మొద‌టిసారి కొవ్వు త‌యారైన‌ప్పుడు అది బ్రౌన్ క‌ల‌ర్ లో ఉంటుంది. ఇలా కొవ్వు క‌ణాల్లో పేరుకుపోయిన కొద్ది ఈ కొవ్వు క్ర‌మంగా తెలుపు రంగులోకి మారిపోతుంది. ఇలా కొవ్వు సంవత్స‌రాల త‌ర‌బ‌డి కొవ్వు క‌ణాల్లో పేరుకుపోయిన కొద్ది ఆ క‌ణాల్లో ఇన్ ప్లామేష‌న్ త‌యార‌వుతుంది. సైటోకైన్స్ విడుద‌ల అవుతూ ఉంటాయి. ఫ్రీరాడిక‌ల్స్ త‌యార‌వుతూ ఉంటాయి. ఇలా కొవ్వు క‌ణాల్లో ఇన్ ప్లామేష‌న్ రావ‌డం వ‌ల్ల క్ర‌మంగా ఇది క్యాన్స‌ర్ కు దారి తీస్తుంది. అలాగే ఆటో ఇమ్యునో జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశం ఉంది. వీటితో అనేక ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా వ‌చ్చే అవ‌కాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఇలా అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా కాపాడ‌డంలో ల‌వంగాలు చ‌క్క‌గా ప‌నికి వ‌స్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ఎంతోకాలంగా ల‌వంగాల‌ను మ‌నం వంట‌ల్లో వాడుతూ ఉన్నాము. ల‌వంగాల్లో ఎన్నో ఔష‌ధ గుణాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. ల‌వంగాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ముఖ్య‌గా ల‌వంగాల్లో యూజ‌నాల్ అనే ర‌సాయ‌న స‌మ్మేళ‌నం ఉంటుంది. 100 గ్రాముల ల‌వంగాల్లో 14 గ్రాముల యూజ‌నాల్ ఉంటుంది. అలాగే వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ‌గా ఉంటాయి. ఇవి కొవ్వు క‌ణాల్లో వ‌చ్చే ఇన్ ప్లామేష‌న్ న త‌గ్గించ‌డంలో, సైటోకైన్స్ ను, ఫ్రీరాడిక‌ల్స్ ను తొల‌గించ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి.

Daily One Clove wonderful benefits
Daily One Clove

కొవ్వు క‌ణాల్లో వ‌చ్చే ఇన్ ప్లామేష‌న్ ను త‌గ్గించ‌డంలో ల‌వంగాలు ఎంతో చ‌క్క‌గా ప‌నిచేస్తాయ‌ని నిపుణులు ప‌రిశోధ‌న‌ల ద్వారా వెల్ల‌డించారు. బ్రెజిల్ దేశ శాస్త్ర‌వేత్త‌లు జ‌రిపిన ప‌రిశోధ‌న‌ల్లో ఈ విష‌యం వెల్లడైంది. ఎక్కువ‌కాలం పాటు శ‌రీరంలో కొవ్వు పేరుకుపోయిన వారు ల‌వంగాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ల‌వంగాల‌ను రోజు ఒక్క‌టి చొప్పున తిన‌డం వ‌ల్ల అలాగే వీటిని వంట‌ల్లో వాడ‌డం వ‌ల్ల లేదా ల‌వంగాల‌తో టీని త‌యారు చేసి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మస్య‌ల బారిన ప‌డ‌కుండా ఉంటామ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts