ఒకసారి బరువు తగ్గించుకుంటే మరోమారు అది రాకుండా చూసుకోవడం చాలామందికి అసాధ్యంగానే వుంటుంది. కాని వివిధ రకాల ఆహారాలు, డైటింగ్ విధానాలు వ్యాయామాలు డయాబెటిక్ రోగుల ఆరోగ్యంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. వ్యాయామం చేస్తే అది రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ ను నియంత్రించి టైప్ 2 డయాబెటీస్ రాకుండా చేస్తుంది. గ్లైసిమిక్ నియంత్రణ మెరుగైన రీతిలో వుండేలా చేస్తుంది. ఇప్పటికే టైప్ 2 డయాబెటీస్ వున్నవారికి క్రమంతప్పకుండా రోజూ వ్యాయామాలు చేస్తే వారి శారీరక సామర్ధ్యం పెరిగి, వారిలోని ఇన్సులిన్ సక్రమంగా ఉపయోగించబడుతుంది. బరువును కూడా అరికడుతుంది.
అయితే, ఒక సారి బరువు తగ్గినవారు మరోమారు అధిక బరువు ఎక్కకుండా టైప్ 2 డయాబెటీస్ వ్యాధి బారిన పడకుండా తమ బ్లడ్ గ్లూకోజ్ స్ధాయిలను ఆహారం ద్వారానే తగ్గించుకోవచ్చు. అధిక బరువు తగ్గటానికి క్రమం తప్పని వ్యాయామం, శారీరక శ్రమ మంచి మార్గాలని రీసెర్చి చెపుతోంది.
బరువు తగ్గటం మీకు గల గుండెసంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలను తగ్గించడం, మీ రక్తపోటు తక్కువగా వుంచటం, చెడు కొల్లెస్టరాల్ అరికట్టటం వంటివి చేస్తుంది. మరి ఆరోగ్యకరమైన విధానంలో ఆహారాలు ఎలా తీసుకోవాలనే ప్రణాళికలు కొరకై ఈ విషయంలో నిపుణులైన డైటీషియన్లను లేదా సంబంధిత వైద్యులను సంప్రదించండి.