Kidney And Liver : మానవ శరీరంలో ముఖ్యమైన అవయవాలలో కిడ్నీ, లివర్ కూడా ఉంటాయి. ఇవి మన శరీరంలోని హానికరమైన పదార్ధాలని తొలగించి మీరు ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పాటునందిస్తుంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల ప్రమాదాన్ని సైతం ఇవి దూరం చేయగలవు. మూత్ర నాళాల ఇన్ఫెక్షన్, మూత్రపిండాల్లో రాళ్లు లేదా ఏదైనా కిడ్నీ సంబంధిత వ్యాధుల విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. లివర్, కిడ్నీలు మన శరీరంలోని మలినాలను బయటకు పంపించి, బాడీని శుద్ధి చేస్తాయి. అయితే ఇంతటి ముఖ్యమైన అవయవంగా ఉన్న వాటిని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవల్సిన అవసరం ఎంతైన ఉంటుంది. అందుకే రోజూ ఉదయాన్నే కొన్ని డిటాక్స్ టిప్స్ పాటించాల్సి ఉంటుంది.
డిటాక్స్ ఎలా చేయాలంటే మనకు విరివిగా దొరికే నిమ్మరసంలో విటమిన్ సి ఉంటుంది. రోజూ పొద్దున్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగితే, బాడీలోని టాక్సిన్ బయటకు పోయి కాలేయం, మూత్రపిండాల పనితీరును పెంచుతుంది. ఇక ప్రతి రోజు వ్యాయామం చేయడం ముఖ్యమైనది. ఉదయాన్నే వ్యాయామం చేయడం వలన కూడా కిడ్నీ, కాలేయం చాలా చక్కగా పని చేస్తాయి. వ్యాయామం రక్త ప్రసరణను మెరుగుపరిచి జీర్ణక్రియను బ్యాలెన్స్ చేస్తూ, టాక్సిన్స్ అన్నింటినీ తొలగిస్తుంది. ఒత్తిడిని తగ్గించి రక్త ప్రసరణను పెంచుతుంది. ఇక ప్రతిరోజూ నిద్ర లేవగానే రెండు గ్లాసుల నీరు తాగడం మంచిది. మీ మెదడు నుండి కాలేయం వరకు అన్ని అవయవాలు సక్రమంగా పని చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఉదయాన్నే నీరు తాగడం వలన శరీరానికి అనవసరమైన పదార్ధాలని విసర్జన చేసేందుకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను ఫిల్టర్ చేయడంలో నీరు కీలకంగా పనిచేస్తుంది. అందుకే, పురుషులు ప్రతిరోజూ ఉదయం దాదాపు 3.7 లీటర్లు, మహిళలు 2.7 లీటర్ల నీరు తాగితే చాలా మంచిది. ఇక ప్రతి రోజు ఉదయం తలస్నానం చేస్తే ఎంతో ఉత్సాహంగా ఉంటారు. స్నానం చేసే సమయంలో చర్మాన్ని సున్నితంగా స్క్రబ్ చేసుకోవడం వలన శరీరంపై పేరుకుపోయే మలినాలు తొలగిపోతాయి. అలాగే రక్త ప్రసరణ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇక ఆరోగ్యకరమైన ఆహారం తినడం వల్ల మూత్రపిండాలు, కాలేయం బాగా పని చేస్తాయి. శరీరానికి అవసరమైన పోషకాలను అందించే వెల్లుల్లి, పసుపు, కూరగాయలు వంటి ఆహారాలను డైట్‌లో భాగం చేసుకోవడం ఉత్తమం.