యాపిల్ పండ్లను తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. రోజూ ఒక యాపిల్ పండును తింటే వైద్యుల వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదంటారు. అది అక్షరాలా నిజం. ఎందుకంటే యాపిల్ పండ్లలో మన శరీరానికి కావల్సిన పోషకాలు అన్నీ దాదాపుగా ఉంటాయి. అందువల్లే దాన్ని తింటే వైద్యుల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదని చెబుతారు. అయితే యాపిల్ పండ్లను సరైన సమయంలో తింటేనే ప్రయోజనాలు కలుగుతాయి. లేదంటే ఇబ్బందులు తప్పవు.
యాపిల్ పండ్లను సరైన సమయంలో తినకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. దీంతోపాటు తీవ్రమైన కడుపునొప్పి వస్తుంది. రాత్రి పూట యాపిల్ పండ్లను అస్సలు తినరాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే రాత్రి పూట సహజంగానే జీర్ణక్రియ నెమ్మదిగా జరుగుతుంది. యాపిల్ పండ్లు జీర్ణం అయ్యేందుకు చాలా సమయం పడుతుంది. కనుక రాత్రి సమయంలో వాటిని తింటే అప్పటికే జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది కనుక యాపిల్ పండ్ల వల్ల ఆ శక్తి ఇంకా తగ్గుతుంది. దీంతో కడుపునొప్పి వస్తుంది. మలబద్దకం సంభవిస్తుంది. గ్యాస్ కూడా వస్తుంది. కనుక యాపిల్ పండ్లను రాత్రిపూట అస్సలు తినరాదు.
ఇక యాపిల్ పండ్లను తినేందుకు సరైన సమయం ఏదంటే.. అది ఉదయం అని చెప్పవచ్చు. ఉదయం పూట ఈ పండ్లను తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.
1. యాపిల్ పండ్లలో సాల్యుబుల్ ఫైబర్ ఉంటంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా చూస్తుంది. దీంతో హార్ట్ ఎటాక్‌లు రావు.
2. యాపిల్ పండ్లను ఉదయం తినడంవల్ల వాటిల్లో ఉండే ఫైబర్ జీర్ణాశయానికి ఎంతో మేలు చేస్తుంది. దీని వల్ల మలబద్దకం తగ్గుతుంది.
3. యాపిల్ పండ్లలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఈ పండ్లలో ఉండే విటమిన్ సి అనేక అనారోగ్య సమస్యలు రాకుండా రక్షిస్తుంది.
4. డయాబెటిస్ సమస్య ఉన్నవారు రోజూ ఉదయాన్నే యాపిల్ పండ్లను తింటే మంచిది. దీంతో షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.
ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365