సాధారణంగా చాలా మంది ఆఫీసులకు వెళ్లేవారు షూస్‌ను ధరిస్తుంటారు. ఇవి చాలా కమ్‌ఫర్ట్‌ను అందించడమే కాదు, కాళ్లకు మేలు చేస్తాయి. పాదాలను రక్షిస్తాయి. పాదాలు అందంగా మారేలా చేస్తాయి. షూస్ ధరించడం వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు కలుగుతాయి. అయితే ఒకే షూస్‌ను మాత్రం రోజూ ధరించకూడదని, వాటిని మార్చాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.
రోజూ ఒకే షూస్ ధరించడం వల్ల వాటిల్లో బాక్టీరియా, ఫంగస్ పెరిగిపోయి పాదాలకు ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుందని, కనుక రోజూ ఒకే షూస్‌ను ధరించకూడదని అంటున్నారు. కనీసం 3, 4 జతల షూస్‌ను కొని పెట్టుకోవాలని ఒక జత షూస్‌ను 2 రోజులకు మించి ధరించకూడదని అంటున్నారు.
ఒకసారి ధరించిన షూస్‌ను మళ్లీ ధరించేందుకు కనీసం 4-5 రోజుల సమయం ఇవ్వాలని దీంతో షూస్‌లో ఉండే బాక్టీరియా, ఫంగస్ నశిస్తాయని, అప్పుడు పాదాలు సురక్షితంగా ఉంటాయని వారు చెబుతున్నారు. కనుక రోజూ ఒకే షూస్ ను ధరించే వారు వెంటనే ఆ అలవాటును మానుకోండి. 3, 4 జతల షూస్‌ను రెడీగా పెట్టుకోండి.