వేసవి వచ్చేసింది. చలితో గిలిగింతలు పెట్టిన కాలం వేడితో ముచ్చెమటలు పట్టించడానికి రెడీ అయింది. ఈ నేపథ్యంలో మన ఆహార అలవాట్లలో చాలా తేడా వచ్చేస్తుంది. సాధారణంగా సమ్మర్ లో శరీరానికి చల్లదనాన్నిచ్చే పానీయాలని, ఆహారాలని తీసుకుంటారు. దానివల్ల శరీరం డీ హైడ్రేట్ అవకుండా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే తొందరగా తయారు చేసుకునే ఆహార పదార్థాలని ప్రిపేర్ చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. వేడిని తట్టుకుని కిచెన్ లో ఎక్కువ సేపు ఉండడం ఇబ్బంది కాబట్టి, తొందరగా రెడీ అయ్యే ఆహారాలు రెడీ చేసుకుంటారు.అందుకే ఈ రోజు ఓ ప్రత్యేకమైన సలాడ్ ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు..
2దోసకాయ ముక్కలు, 2 చిన్న ఆకుపచ్చ గుమ్మడికాయ ముక్కలు, 2 చిన్న పసుపు పచ్చ గుమ్మడికాయ ముక్కలు, 2కప్పులు సన్నగా తరిగిన పాలకూర, 100గ్రాముల ఫెటా చీజ్, 1టేబుల్ స్పూన్ పిండిగా చేసిన నల్ల మిరియాలు, 2టేబుల్ స్పూన్ల మెంతులు, 10చెర్రీ టమాటలు.
తయారీ పద్దతి..
ఒక పాత్రని తీసుకుని అందులో ఫెటా ఛీజ్, నల్ల మిరియాలు, మెంతులు జోడించి బాగా కలపాలి. బాగా మృదువుగా అయ్యే వరకు ఇలా చేస్తూనే ఉండాలి. అప్పుడు కట్ చేసిన దోసకాయ ముక్కలని, గుమ్మడికాయ ముక్కలని దానిలో కలపాలి. ఇలా చేసాక వడ్డించే పళ్ళెంలో సన్నగా తరిగిన పాల కూరని ఉంచండి. ఆ తర్వాత చెర్రీ టమాటలని సలాడ్ పై అందంగా అలంకరించండి. రుచి కోసం కొద్దిగా జున్నుని కలుపుకున్నా బాగానే ఉంటుంది. అంతే వేడి వేడిగా ఉండే సలాడ్ రెడీ అయినట్టే.