మనకు తినేందుకు అనేక రకాల ఆరోగ్యకరమైన ఆహారాలు ఉన్నప్పటికీ కొందరు మాత్రం జంక్ ఫుడ్‌నే ఎక్కువగా తింటుంటారు. దీంతో అనారోగ్యాల బారిన పడుతుంటారు. అయితే కొన్ని రకాల ఆహారాలను కొందరు ఇప్పటికీ జంక్ ఫుడ్ అనే అనుకుంటుంటారు. కానీ అవి జంక్ ఫుడ్ కాదు. ఆరోగ్యకరమైనవే. వాటి రూపం, అవి ఉండే తీరు పట్ల వాటిని జంక్ ఫుడ్ అని భావిస్తుంటారు. కానీ అవి చాలా ఆరోగ్యకరమైన ఆహారాలు. అలాంటి ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. పాప్‌కార్న్ అంటే సహజంగానే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. దీన్ని చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ తింటుంటారు. అయితే నిజానికి పాప్ కార్న్ జంక్ ఫుడ్ కాదు. ఇది చాలా ఆరోగ్యకరమైనది. పాప్‌కార్న్‌లో ఉండే ఫైబర్ మనకు ఎంతగానో మేలు చేస్తుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకం తగ్గిస్తుంది. పాప్‌కార్న్ ద్వారా తక్కువ క్యాలరీలు లభిస్తాయి. అందువల్ల బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఇది మంచి ఆహారం అని చెప్పవచ్చు. కాబట్టి ఇకపై పాప్‌కార్న్‌ను జంక్ ఫుడ్ అని భావించకండి. నిర్భయంగా తినండి.
2. డార్క్ చాకొలెట్లు ఆరోగ్యకరమైన ఆహారాలే. పేరుకే చాకొలెట్ అని ఉంటుంది, కానీ ఇవి జంక్ ఫుడ్ కాదు. డార్క్ చాకొలెట్‌లో కోకోవా ఎక్కువగా ఉంటుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండెకు ఎంతగానో మేలు చేస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అందువల్ల స్వల్ప మొత్తాల్లో డార్క్ చాకొలెట్లను తినవచ్చు. వీటిని జంక్ ఫుడ్ అని భావించరాదు. ఆరోగ్యకరమైన ఆహారమే.
3. పీనట్ బటర్ ప్యాక్ చేయబడిన ఆహారం. అందుచేత దాన్ని జంక్ ఫుడ్ అనుకుంటారు. కానీ ఇది నిజానికి ఆరోగ్యకరమైన ఆహారం. దీన్ని వేరుశెనగల నుంచి తయారు చేస్తారు. కాబట్టి వాటిల్లో అనేక పోషకాలు ఉంటాయి. అవన్నీ మనకు శక్తిని ఇస్తాయి. పైగా బరువు తగ్గేందుకు సహాయ పడతాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అందువల్ల పీనట్ బటర్‌ను కూడా నిర్భయంగా తినవచ్చు.
4. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. కానీ స్వల్ప మొత్తాల్లో మద్యం సేవిస్తే శరీరానికి మేలే జరుగుతుంది. ఇక మద్యంలో వైన్ ఒక రకానికి చెందినది. అందులో రెడ్ వైన్ చాలా మేలు చేస్తుంది. దీన్ని నిర్దిష్టమైన మోతాదులో తాగితే అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనకు మేలు చేస్తాయి. అవి రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అందువల్ల అప్పుడప్పుడు ఎలాంటి భయం లేకుండా వైన్ తాగవచ్చు. అది జంక్ ఫుడ్ కాదు.