హెల్త్ టిప్స్

Bottle Gourd Juice : 21 రోజులు ఈ జ్యూస్ తాగండి.. వెంటనే బరువుతో పాటు పొట్ట కూడా తగ్గుతుంది..

Bottle Gourd Juice : అధిక బరువు ఉండడం.. గుండె జబ్బులు, డయాబెటిస్, స్ట్రోక్, కొన్ని రకాల క్యాన్సర్‌లకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అటువంటి పరిస్థితిలో బరువును నియంత్రించడం చాలా ముఖ్యం. అధిక బరువును, పొట్టను తగ్గించుకోవాలంటే ఇలా చేయడం చాలా మంచిది. ఉదయం లేవగానే లీటరంపావు నీళ్లు తాగి మలవిసర్జన చేసి మళ్లీ రెండవసారి నీళ్లు తాగి మళ్లీ మలవిసర్జన చేయాలి. 9 గంటలకు సొరకాయ జ్యూస్ తాగాలి. సొరకాయ లివర్ లోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపేందుకు ఉపయోగపడుతుంది. ఈ సొరకాయ జ్యూస్ ని ఫిల్టర్ చేసి 300ఎంఎల్ గానీ 400ml గానీ తీసుకుని దాంట్లో తేనె లేదా నిమ్మరసం కలిపి తాగాలి.

ఆ తర్వాత 11 గంటలకి టమోటా, కీర దోసకాయ జ్యూస్ తాగాలి. దీనికి క్యారెట్, బీట్‌రూట్ కూడా కలిపి తాగొచ్చు. వీటిలో బీటా కెరోటిన్ ఉంటుంది. వీటన్నింటి కంటే బీటా కెరోటిన్ కరివేపాకులో ఎక్కువగా ఉంటుంది. వీటన్నింటినీ నీళ్లు కలపకుండా గ్రైండ్ చేసి ప్యూర్ జ్యూస్ తీయాలి. ఇలా తీసిన జ్యూస్ ని ఒక 300 ml తీసుకుని తేనె, నిమ్మరసం కలిపి తాగాలి. బ‌రువు తగ్గాలనుకునే వారు మధ్యాహ్నం ఒకటి లేదా రెండు పుల్కాల‌ను మూడు కూరలతో కలిపి తినాలి. ప్రతిరోజు ఆకుకూర మాత్రం ఉండేలా చూసుకోవాలి. దీంతో ఈజీగా బరువు తగ్గుతారు. పొట్ట కూడా తగ్గిపోతుంది.

drink bottle gourd juice for 21 days know what happens

అలాగే సాయంత్రం పూట ఫ్రూట్ జ్యూసులు తాగాలి. ముఖ్యంగా దానిమ్మ జ్యూస్ తీసుకుంటే పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. కాబట్టి ఇది లివర్ కు కూడా చాలా మంచిది. మళ్లీ రాత్రి 7 గంటలకు కమల జ్యూస్ 300 ml తాగాలి. దీనిలో తేనె కలపకూడదు. అలాగే పుల్లపుల్లగా తాగాలి. ఇలా చేస్తే మద్యం మీద మనసు మళ్ళకుండా ఉంటుంది. తర్వాత ఉసిరికాయ ముక్కలను నోట్లో పెట్టుకుని చప్పరించాలి.

ఇలా రోజుకి నాలుగు జ్యూసులు తాగడం వల్ల విటమిన్ A, విటమిన్ C, జింక్ ఇలాంటివన్నీ శరీరానికి పుష్కలంగా అందుతాయి. మధ్యాహ్నం ఆహారం ద్వారా ప్రోటీన్ బీ కాంప్లెక్స్ అందుతుంది. కాబట్టి ఈ జ్యూసులు తాగడం వల్ల మందు మీద వ్యసనాల మీద ఉన్న ధ్యాసను తగ్గిస్తాయి. ఇలా 21 రోజుల పాటు చేస్తే బరువుతోపాటు పొట్ట కూడా తగ్గి నూతనోత్సాహం వస్తుంది.

Admin

Recent Posts