Copper Water : ప్రపంచంలో అత్యంత పురాతనమైన వైద్య విధానంగా ఆయుర్వేదం ఎంతో పేరుగాంచింది. ఈమధ్యకాలంలో చాలా మంది ఆయుర్వేద వైద్యానికి ప్రాధాన్యతను ఇస్తున్నారు. అందుకనే సహజసిద్ధమైన పద్ధతిలో వ్యాధులను నయం చేసుకునేందుకు ఆలోచిస్తున్నారు. ఇక రాగి పాత్రలో నీటిని నిల్వ ఉంచి తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని కూడా ఆయుర్వేదం ఎప్పుడో చెప్పింది. కానీ దీన్ని చాలా మంది పాటించడం లేదు. కానీ ఇలా తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. రాత్రంతా రాగి పాత్రలో నీటిని నిల్వ ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపునే ఆ నీటిని తాగాలి. దీంతో అనేక లాభాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని పరగడుపునే తాగితే రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ఎలాంటి వ్యాధిని అయినా సరే రాకుండా ఎదుర్కొనే శక్తి మనకు లభిస్తుంది. సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు రాకుండా ముందుగానే నివారించవచ్చు. అలాగే బాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు, ఇతర వ్యాధులు రావు.
2. పరగడుపునే రాగి పాత్రలోని నీటిని తాగితే శరీరంలోని వ్యర్థాలు, విష పదార్థాలు బయటకు పోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. శరీరంలో ఉండే బాక్టీరియా, ఇతర సూక్ష్మ క్రిములు నశిస్తాయి. దీంతో రోగాలు నయమవుతాయి.
3. కీళ్ల నొప్పులు, వాపుల సమస్య ఉన్నవారు ఈ నీళ్లను తాగితే ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.
4. మన శరీరానికి అవసరం అయిన మినరల్స్‌లో కాపర్ ఒకటి. అందువల్ల రాగిపాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగితే శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా కొవ్వు కరుగుతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. నడుము వద్ద ఉండే కొవ్వు కరిగి సన్నగా, నాజూగ్గా మారుతుంది.
5. మన శరీరానికి రాగి ఎంతో అవసరం. రాగి పాత్రలో నీటిని నిల్వ చేస్తే అందులోకి రాగి అణువులు చేరుతాయి. అవి మన శరీరానికి లభిస్తాయి. అవి మన మెదడును యాక్టివ్‌గా ఉంచుతాయి. దీంతో మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. చిన్నారులు అయితే చదువుల్లో రాణిస్తారు. తెలివితేటలు పెరుగుతాయి.
6. రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగడం వల్ల షుగర్ లెవల్స్, కొలెస్ట్రాల్ లెవల్స్, బీపీ తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా రాగి పాత్రలోని నీటితో అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.