Raisin Water : కిస్మిస్‌లు తినేందుకు రుచిలో ఎంతో తియ్యగా ఉంటాయి. అందుకని వీటిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. వీటిని తరచూ తీపి వంటకాల్లో వేస్తుంటారు. దీంతో ఆయా స్వీట్లకు చక్కని రుచి వస్తుంది. అయితే కిస్మిస్‌లతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వీటిలో అనేక పోషకాలు ఉంటాయి. ఈ క్రమంలోనే ఒక గుప్పెడు కిస్మిస్‌లను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ కిస్మిస్ నీళ్లను పరగడుపునే తాగాలి. ఇలా నెల రోజుల పాటు చేస్తే.. అనేక లాభాలు కలుగుతాయి. మీ శరీరంలో ఊహించని మార్పులు వస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. కిస్మిస్‌లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందువల్ల వీటి నీళ్లను తాగితే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
2. కిస్మిస్‌లలో ఐరన్ బాగా ఉంటుంది. కనుక కిస్మిస్ నీళ్లను నెల రోజుల పాటు తాగితే శరీరంలో రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది.
3. వీటిలో ఉండే పొటాషియం శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో హైబీపీ తగ్గుతుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు.
4. కిస్మిస్ నీళ్లను తాగితే శక్తి బాగా లభిస్తుంది. ఉత్సాహంగా పనిచేస్తారు. నీరసం, అలసట తగ్గుతాయి. జ్వరం త్వరగా తగ్గుతుంది. రోజూ శారీరక శ్రమ, వ్యాయామం ఎక్కువగా చేసేవారు ఈ నీళ్లను తాగితే శక్తి బాగా లభించి ఉత్సాహంగా మారుతారు. ఎంత పని చేసినా అలసిపోరు. చిన్నారులు అయితే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. తెలివితేటలు పెరుగుతాయి. చదువుల్లో రాణిస్తారు.
5. కిస్మిస్ నీళ్లను తాగడం వల్ల మలబద్దకం సమస్య ఉండదు. పొట్టంతా కడిగేసినట్లు క్లీన్ అవుతుంది. గ్యాస్, కడుపులో మంట కూడా తగ్గుతాయి.
6. ఈ నీళ్లను నెల రోజుల పాటు తాగితే చర్మం కాంతింవంతంగా మారి మెరుస్తుంది. మొటిమలు, మచ్చలు పోతాయి.