Dry Coconut : మన వంటల్లో రుచి, చిక్కదనం కోసం వాడే ఆహార పదార్థాలలో ఎండు కొబ్బరి ఒకటి. ఎండు కొబ్బరిని పొడిగా చేసి వంటల్లో వాడుతూ ఉంటాం. అంతే కాకుండా అనేక రకాల తీపి పదార్థాల తయారీలోనూ ఎండు కొబ్బరిని వాడుతూ ఉంటాం. ఎండు కొబ్బరిని చాలా మంది నేరుగా కూడా తింటూ ఉంటారు. ఎండు కొబ్బరిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక లాభాలను పొందవచ్చు.

పచ్చి కొబ్బరిలో ఉండే విధంగానే ఎండు కొబ్బరిలోనూ అనేక రకాల విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఎండు కొబ్బరిని 50 గ్రా. ల చొప్పున రోజూ తినడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. మితంగా ఎండు కొబ్బరిని తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎండు కొబ్బరిని తినడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. ఎండు కొబ్బరిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీనిని బెల్లంతో కలిపి తీసుకోవడం వల్ల రక్త హీనత సమస్య తగ్గుతుంది. రక్తం బాగా తయారవుతుంది.
తరచూ ఎండు కొబ్బరిని తినడం వల్ల సంతాన లేమి సమస్యలు కూడా తగ్గుతాయి. క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఎండు కొబ్బరిని వాడడం వల్ల రోగ నిరోధక శక్తిని పెరగడంతోపాటు మెదడు పని తీరు కూడా మెరుగుపడుతుంది. దీనిని వాడడం వల్ల ఎటువంటి దుష్పభ్రావాలు కూడా కలగవు. ఎండు కొబ్బరిని రోజూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల రోజంతా చురుకుగా ఉండవచ్చు. ఎండు కొబ్బరిని తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ దీనిని మితంగా తీసుకోవడం వల్ల మాత్రమే ఈ ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అధికంగా తీసుకుంటే నష్టాలు ఉంటాయి. కనుక వీటిని తక్కువ మోతాదులో రోజూ తినాలి. దీంతో ఆరోగ్యంగా ఉంటారు.