Horse Gram : మన పూర్వీకులు ఎంతో కాలం నుంచి ఉలవలను తీసుకుంటున్నారు. కానీ మనం ఇప్పుడు వీటిని వాడడం లేదు. అయితే ఉలవలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. మనం ఎక్కువగా ఉలవలతో చారును, కారం పొడిని, గుగ్గిళ్లను తయారు చేసుకుని తింటూ ఉంటాం. అయితే ఉలవలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. అధిక బరువుతో బాధపడే వారు ఉడికించిన ఉలవలను పరగడుపున తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. పురుషులలో లైంగిక సామర్థ్యాన్ని పెంచే గుణం ఉలవలకు ఉంది. ఉలవలను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మూత్ర పిండాలలో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి.

స్త్రీలలో నెలసరి సమస్యలను తగ్గించడంలోనూ ఉలవలు ఎంతో సహాయపడతాయి. ఎదిగే పిల్లలకు ఉలవలు ఒక టానిక్ లాగా పని చేస్తాయని చెప్పవచ్చు. ఉలవలను తీసుకోవడం వల్ల నీరసం, రక్త హీనత నుండి బయట పడవచ్చు. మూత్రాశయ, జీర్ణాశయ సంబంధిత సమస్యలను తగ్గించే శక్తి ఉలవలకు ఉంది. చెమటలు అధికంగా పట్టే వారు ఉలవలను ఆహారంగా తీసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది. ఉలవలతో చేసిన చారును రోజూ ఆహారంగా తీసుకోవడం వల్ల పక్షవాతం, నడుము నొప్పి, సయాటికా, కీళ్ల నొప్పుల వంటి సమస్యల నుండి సత్వర ఉపశమనం లభిస్తుంది.
ఉలవలతో చేసిన కషాయాన్ని పెసర పప్పుతో కలిపి తీసుకోవడం వల్ల జ్వరం త్వరగా తగ్గుతుంది. వాపులు, నొప్పులు ఉన్న చోట ఉలవలను వేయించి వస్త్రంలో కట్టి కాపడం పెట్టుకోవడం వల్ల వాపులు, నొప్పులు తగ్గుతాయి. తరచుగా వెక్కిళ్లతో బాధపడే వారు, కంటి సమస్యలు ఉన్న వారు ఉలవలను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 100 గ్రా. ల ఉలవలను రోజూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల పోషకాల లోపం వల్ల వచ్చే సమస్యలు తగ్గుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
ఉలవలను తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కడుపులో నులి పురుగులను నివారించడంలో కూడా ఉలవలు ఉపయోగపడతాయి. ఉలవల కషాయాన్ని పాలలో కలుపుకుని తాగడం వల్ల నులి పురుగులు నశిస్తాయి. ఉలవలను ఆహారంగా తీసుకోవడం వల్ల స్త్రీలలో వచ్చే తెల్ల బట్ట వంటి సమస్యలు కూడా తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కనుక ఉలవలను ఆహారంలో భాగంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.