Eggs : కోడిగుడ్ల‌ను తింటే నిజంగానే బ‌రువు త‌గ్గుతారా ? అసలు ఇందులో నిజం ఎంత ఉంది ?

Eggs : మ‌న‌కు అందుబాటులో ఉండే అతి త‌క్కువ ధ‌ర క‌లిగిన పోష‌కాహారాల్లో కోడిగుడ్లు కూడా ఒక‌టి. వీటిని సంపూర్ణ పౌష్టికాహారంగా నిపుణులు చెబుతారు. ఎందుకంటే మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే దాదాపు 90 శాతానికి పైగా పోష‌కాలు వీటిల్లో ఉంటాయి. క‌నుక గుడ్ల‌ను సంపూర్ణ పౌష్టికాహారంగా పిలుస్తారు. కాబ‌ట్టే వీటిని రోజుకు ఒక‌టి తినాల‌ని వైద్యులు చెబుతుంటారు. అయితే కోడిగుడ్ల‌ను తిన‌డంలో చాలా మందికి అనేక సందేహాలు ఉంటాయి. వాటిల్లో ఇది కూడా ఒక‌టి. అదేమిటంటే..

కోడిగుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే గుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని చెబుతుంటారు. ఇది నిజ‌మేనా ? వాటిల్లో కొలెస్ట్రాల్ ఉంటుంది క‌దా ? అలాంట‌ప్పుడు గుడ్ల‌ను తింటే మ‌నం బ‌రువు ఎలా త‌గ్గుతాం ? అని చాలా మందికి సందేహాలు వ‌స్తుంటాయి. ఇక వీటికి నిపుణులు ఏమ‌ని స‌మాధానాలు చెబుతున్నారంటే..

eating eggs really help to wright loss what is the truth
Eggs

కోడిగుడ్ల‌లో కొలెస్ట్రాల్ ఉంటుంది. నిజ‌మే. కానీ మ‌న‌కు రోజులో కావ‌ల్సిన కొలెస్ట్రాల్‌లో గుడ్డు ద్వారా ల‌భించేది త‌క్కువే. ఇంకా ఎక్కువ మొత్తంలోనే మ‌న‌కు కొలెస్ట్రాల్ కావాలి. క‌నుక ఒక గుడ్డును తింటే మ‌న‌కు ల‌భించే కొలెస్ట్రాల్ చాలా త‌క్కువే కాబ‌ట్టి.. అది మ‌న శ‌రీరానికి హాని చేయ‌దు. పైగా కోడిగుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల వాటిల్లో ఉండే ప్రోటీన్లు, ఇత‌ర పోష‌కాలు.. మ‌న శ‌రీర మెట‌బాలిజంను పెంచుతాయి. దీంతో క్యాల‌రీలు వేగంగా ఖ‌ర్చ‌వుతాయి. ఫ‌లితంగా శ‌రీరంలో ఉండే కొవ్వు క‌రుగుతుంది. దీంతో అధిక బ‌రువు త‌గ్గుతారు. ఇలా కోడిగుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నకు ప‌రోక్షంగా మేలు జ‌రుగుతుంద‌న్న‌మాట‌. అందువ‌ల్లే గుడ్ల‌ను తింటే బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని చెబుతుంటారు.

అయితే ఎవ‌రైనా స‌రే రోజుకు ఒక ఉడ‌క‌బెట్టిన కోడిగుడ్డును తిన‌వ‌చ్చు. దీంతో ఆరోగ్య‌వంత‌మైన రీతిలో బ‌రువు త‌గ్గుతారు. అంత‌కు మించితే మాత్రం శ‌రీరంలో కొలెస్ట్రాల్ అధికంగా చేరుతుంది. ఇది అధికంగా బ‌రువును పెంచుతుంది. దీంతో డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. క‌నుక కోడిగుడ్ల‌ను రోజుకు ఒక‌టి మాత్ర‌మే తినాలి. దీంతో అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.

Editor

Recent Posts